అలంపూర్ ఏ నది ఒడ్డున ఉన్నది? 1) తుంగభద్ర 2) కృష్ణా 3) గోదావరి 4) పెన్నా 2.‘చిత్తారమ్మ జాతర’ ఏ ప్రాంతంలో జరుపుతారు? 1) పటాన్చెరు, సంగారెడ్డి 2) అనంతగిరి, వికారాబాద్ 3) కోయిలకొండ, మహబూబ్‌నగర్ 4) గాజుల రామారం, హైదరాబాద్
ఫ్లోరింగ్, పై కప్పులకు ఉపయోగపడే భీమా గ్రూప్ సున్నపురాయి రాష్ట్రంలో ఎక్కడ లభిస్తుంది? 1) మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ 2) మంచిర్యాల జిల్లా తాండూర్ 3) నల్లగొండ జిల్లా తడకమళ్ల 4) వికారాబాద్ జిల్లా తాండూర్
కింది వాటిలో సరికానిది గుర్తించండి? 1) భూదాన్ ఉద్యమాన్ని వినోబాభావే ‘పోచంపల్లి’లో ప్రారంభించారు 2) భూదానోద్యమం 1951లో ప్రారంభించారు 3) జోగులాంబ దేవాలయం ‘గోదావరి’ నది ఒడ్డున కలదు 1) 1 2) 2 3) 3 4) ఏదీ సరికాదు
మన్నెంకొండ క్షేత్ర ప్రధాన దేవుడు? 1) ఆంజనేయస్వామి 2) నరసింహస్వామి 3) వేంకటేశ్వరస్వామి 4) మల్లన్న స్వామి
తెలంగాణ రాష్ర్టానికి ఏ రాష్ర్టాలతో సరిహద్దు కలదు? 1) కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిషా 2) మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ 3) ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ 4) ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్
కింది వాటిలో సరైనది గుర్తించండి? 1) ఉస్మాన్‌సాగర్ చెరువు ‘మూసీ’ నదిపై నిర్మించారు 2) తెలంగాణ రాష్ట్రంలో ‘గ్రానైట్’ నిల్వలు ఖమ్మం జిల్లాలో అధికంగా ఉన్నాయి 3) సిర్నాపల్లి కొండలు- నిజామాబాద్ జిల్లాలో కలవు 1) 1, 2 2) 2, 3 3) 1, 2, 3 4) 1, 3
జతపర్చండి? ఎ. వేయిస్తంభాల గుడి 1. లింగమంతుల స్వామి బి. పెద్దగట్టు జాతర 2. చేర్యాల సి. భద్రకాళి సరస్సు 3. సిద్ధేశ్వరాలయం డి. నగిషీ చిత్రాలు 4. మానేరు డ్యాం 1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-3, బి-1, సి-4, డి-2 3) ఎ-2, బి-4, సి-3, డి-1 4) ఎ-3, బి-1, సి-2, డి-4
తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం రూపొందించినది ఎవరు? 1) అందెశ్రీ 2) గోరటి వెంకన్న 3) గద్దర్ 4) ఏలే లక్ష్మణ్
శివరామ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ ప్రాంతానికి సమీపంలో ఉంది? 1) కామారెడ్డి 2) మంచిర్యాల 3) సిద్దిపేట 4) మంథని
తెలంగాణలో ‘ధూళికట్ట’ ప్రాంతం దేనికి ప్రసిద్ధి? 1) తెలంగాణలోకి గోదావరి నది ఇక్కడ ప్రవేశిస్తుంది 2) ఈ ప్రదేశంలో రాణిరుద్రమ మరణించారు 3) క్రీ.పూ 2వ శతాబ్దానికి చెందిన ఒక బౌద్ధస్థూపం ఇక్కడ ఉంది 4) శాతవాహనుల కాలంలో ఒక ప్రసిద్ధ వర్తక కేంద్రం
కృష్ణానది ఒడ్డున జూరాల దగ్గర చంద్రగఢ్ పర్వత కోటను ప్రధానంగా ఏ ప్రయోజనం కోసం నిర్మించారు? 1) ఆయుధాలు నిల్వ చేయడానికి 2) జిల్లాదార్ చంద్రసేన నివాసం 3) ప్రజల నుంచి సేకరించిన ఆహార ధాన్యాలను, పన్నులను నిల్వచేయడానికి 4) జైలు
కింది వాటిలో సరికానిది గుర్తించండి? 1) తెలంగాణలో అతిపెద్ద రాష్ట్ర రహదారి-NH 18 2) తెలంగాణలో సంప్రదాయ పట్టునేత కేంద్రం- బోధన్ 3) తెలంగాణ దాదాపు 80 శాతం వర్షపాతం నైరుతి రుతుపవనాల ద్వారా కురుస్తాయి 1) 1 2) 1, 3 3) 2 4) 1, 2
తెలంగాణలో ఏ జిల్లాలో ‘శ్రీరాంసాగర్’ ప్రాజెక్టు ఉంది? 1) కరీంనగర్ 2) రంగారెడ్డి 3) ఆదిలాబాద్ 4) నిజామాబాద్
కింది వాటిలో ఏ ప్రాజెక్టు నదీ పరీవాహక ప్రాంతాల నుంచి నీటిని సరఫరా చేయడానికి వాడారు? 1) పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు 2) శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 3) సింగూరు ప్రాజెక్టు 4) డిండి ప్రాజెక్టు
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి’ సంబంధించి కింది ఏ అంశం సరైంది కాదు? 1) గోదావరి నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా సాగుకోసం అందించాలని ప్రతిపాదించింది 2) దాదాపు 45,000 ఎకరాల భూమిని సాగు చేయాలని ప్రతిపాదించారు 3) ఇది ఒక అంతర్రాష్ట్ర ప్రాజెక్టు 4) కన్నెపల్లి గ్రామ సమీపంలో ఈ ప్రాజెక్టు ఉంది
మేడారం సమ్మక్క-సారలక్క జాతరను ఏ సంవత్సరంలో అధికారికంగా ప్రకటించారు? 1) 1966 2) 1996 3) 2006 4) 2014
భారతదేశ మొట్టమొదటి ఇంధన సమర్థవంతమైన ఏ-1 కేటగిరీ రైల్వేస్టేషన్ ఏది? 1) సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ 2) కాచిగూడ రైల్వేస్టేషన్ 3) బెంగళూర్ రైల్వేస్టేషన్ 4) ఛత్రపతి శివాజీ టెర్మినల్
కింది వాటిలో ఏ జిల్లాలు నల్ల మృత్తికల్లో ఆవరించి లేవు? 1) నల్లగొండ, ఖమ్మం 2) ఆదిలాబాద్, నిజామాబాద్ 3) మహబూబ్‌నగర్, నల్లగొండ 4) మెదక్, కరీంనగర్
తెలంగాణలో ఎర్ర ఇసుక లోమ్ మృత్తికలను స్థానికంగా ఎలా పిలుస్తారు? 1) దుబ్బ 2) చెల్క 3) రేగడి 4) లేటరైట్
కింది వాటిలో సరైనది? 1) రాష్ట్రంలో అత్యధిక మండలాలు కలిగిన జిల్లా- నల్లగొండ 2) రాష్ట్రంలో దక్షిణ భారతదేశ బొగ్గుగని- కొత్తగూడెం 3) రాష్ట్ర అధికారిక క్రీడ- కబడ్డీ 4) హైదరాబాద్ నగరం మూసీ నది తీరాన కలదు 1) 1, 2 2) 1, 2, 4 3) 1, 3, 4 4) 1, 2, 3, 4
కింది రంగాల్లోని రహదారుల్లో ఏ రంగానికి సంబంధించినవి తెలంగాణలో అత్యధికంగా ఉన్నాయి? 1) రోడ్డు, భవనాల విభాగం 2) జాతీయ హైవే రహదారుల విభాగం 3) పంచాయతీరాజ్ విభాగం 4) రాష్ట్ర హైవే విభాగం
రాష్ట్రంలో లేటరైట్ నిక్షేపాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి? 1) సూర్యాపేట 2) నారాయణపేట 3) జగిత్యాల 4) వికారాబాద్
రాష్ట్రంలో ఖనిజ ఆధారిత పరిశ్రమల్లో కింది వాటిలో ఏ రంగం ఆధిపత్యాన్ని కలిగి ఉంది? 1) స్పాంజ్ ఐరన్ ప్లాంట్ 2) గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లు 3) సిమెంట్ ప్లాంట్లు 4) రెడీమిక్స్ కాంక్రీట్ యూనిట్లు
కందికల్, రాఖీ పర్వతాలు ప్రధానంగా విస్తరించి ఉన్న జిల్లా ఏది? 1) ఆదిలాబాద్ 2) మహబూబ్‌నగర్ 3) కరీంనగర్ 4) రంగారెడ్డి
రాష్ట్రంలో నవబ్రహ్మ దేవాలయం ఏ ప్రాంతం ఉంది? 1) వర్గల్, ఉమ్మడి మెదక్ జిల్లా 2) కీసర, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 3) అలంపూర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా 4) వేములవాడ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా
ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో 3.41లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి తెలంగాణ ప్రతిపాదించిన ప్రాజెక్టు? 1) జూరాల- పాకాల ప్రాజెక్టు 2) పాలెంవాగు ప్రాజెక్టు 3) స్వర్ణ ప్రాజెక్టు 4) నక్కలగండి ప్రాజెక్టు
కింది వాటిలో సరికానిది? 1) తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ- దూలపల్లి 2) సిర్నాపల్లి గుట్టలు విస్తరించి ఉన్న జిల్లా- ఉమ్మడి నిజామాబాద్ 3) భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం- భద్రాచలం, ఉమ్మడి ఖమ్మం 1) 1 2) 2 3) 3 4) 1, 2, 3
దక్షిణ తెలంగాణ వ్యవసాయ- వాతావరణ మండల ప్రధాన కేంద్రం? 1) పాలెం 2) సూర్యాపేట 3) షాద్‌నగర్ 4) భువనగిరి
కింది వాటిలో సరికానది? 1) కొమురవెల్లి జాతర- ఉమ్మడి వరంగల్ 2) బెజ్జంకి జాతర- ఉమ్మడి కరీంనగర్ 3) మన్నెంకొండ జాతర – ఉమ్మడి మహబూబ్ నగర్ 4) పెద్ద గొల్లగట్టు జాతర – ఉమ్మడి ఆదిలాబాద్
కింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలో లేని వన్యప్రాణుల అభయారణ్యం? 1) పాకాల 2) నేలపట్టు 3) కవ్వాల్ 4) ఏటూరు నాగారం