UPSC Civils Prelims | అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాలకు సంబంధించి యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (UPSC CSE) ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. వీటితో పాటు ఫారెస్ట్ సర్వీస్ (IFS) ప్రిలిమ్స్ ఫలితాలను కూడా యూపీఎస్సీ విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా మే 25వ తేదీన సివిల్స్ పరీక్షలను యూపీఎస్సీ నిర్వహించింది. దాదాపు 10 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఈ పరీక్షను రాశారు. తాజాగా ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన రూల్ నంబర్ల జాబితాను ప్రకటించింది. కాగా, ఈ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాఫ్ మార్కులు, ఆన్సర్ కీలను తొందరలోనే వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నట్లు యూపీఎస్సీ పేర్కొంది. అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా వెబ్సైట్లో ఉంచింది.
సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా
IFS మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా