TS CPGET 2022 | రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సీపీగెట్) నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, జేఎన్టీయూ హెచ్, మహిళా వర్సిటీల్లో సీపీగెట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. నేటి నుంచి జులై 4వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో జులై 15 వరకు దరఖాస్తులను సమర్పించొచ్చు. జులై 20 నుంచి సీపీగెట్ ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.