హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ 2021-22 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.
కోర్సులు: ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్) ఈవినింగ్, ఎంబీఏ (పార్ట్ టైం) ఈవినింగ్
కోర్సు వ్యవధి: మూడేండ్లు (ఆరు సెమిస్టర్లు)
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు టీఎస్ ఐసెట్-2021లో అర్హత సాధించాలి. ఎగ్జిక్యూటివ్/ మేనేజిరియల్ లేదా అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో రెండేండ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
పరీక్షతేదీ: డిసెంబర్ 5
పరీక్ష విధానం: పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
పరీక్ష సమయం 90 నిమిషాలు
దరఖాస్తు: ఆఫ్లైన్లో
చివరితేదీ: డిసెంబర్ 4
వెబ్సైట్: http://ouadmissions.com