హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. సాంకేతిక విద్య అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్(రాత పరీక్ష) నిర్వహించాలని నిర్ణయించింది. పీహెచ్డీ అర్హత గల వారికి 10, ఈ అర్హత లేని వారికి 20 మా ర్కుల పరీక్ష నిర్వహించాలని స్పష్టంచేసింది. రాష్ట్రంలోని 12 వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జీవో-21 జారీ చేసింది. ఇంజినీరింగ్‌యేతర కోర్సుల అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రాత పరీక్ష లేక పోగా, ఇంజినీరింగ్ కోర్సులు బోధించే వారికి మాత్రం రాత పరీక్ష నిర్వ హించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నది. ఇంజనీరింగ్ కోర్సులు బోధించడానికి మొదట్లో బీటెక్ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించగా.. ఆ తరువాత ఎంటెక్ చేసిన వారికి అవకాశం కల్పించారు. ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించి కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. ఇంజినీరింగ్‌లో పీహెచ్డీ పూర్తిచేసిన వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. నెట్, సెట్ అర్హత గల వారు కూడా అరుదు. దీంతో స్క్రీనింగ్ టెస్టు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణ యించింది. యూజీసీ నిబంధనల ప్రకారం జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) గల వారికి 10 మారులు, నెట్, సెట్, స్లెట్ ఉంటే 5 మారులు, పీహెచ్‌డీకి 10 మారులు, ఎంఫిల్ ఉంటే 5 మారులు, పరిశోధనాపత్రాలు, సదస్సులు నిర్వహించిన వారికి గరిష్ఠంగా 5 మారులు కేటాయిస్తారు.