1. కింది వాక్యాలను పరిశీలించండి?
ఎ) ప్రధాన మంత్రి పంటల బీమా పథకం 2015లో ప్రారంభించారు
బి) ఆహార పంటలు (ధాన్యాలు, చిరుధాన్యాలు పప్పులు), నూనె గింజలు, వార్షిక వాణిజ్య పంటలు, శ్రీ ఉద్యాన పంటలకు ఈ బీమా పథకం వర్తిస్తుంది
సి) ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది
సరైన జవాబును ఎంపిక చేయండి.
1) ఎ, సి 2) ఎ, బి, సి
3) ఎ, బి డి) ఎ, సి
2. కింది జతలను పరిశీలించండి. వ్యవసాయయోగ్యమైన కమాండ్ ప్రాంతం ప్రాజెక్టు పథకం
ఎ) 10,000 హెక్టార్లకు మించి – మేజర్ ఇరిగేషన్
బి) 10,000 నుంచి 25,000 ఎకరాల వరకు సాగు చేయగల భూమి- మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్
సి) 10,000 ఎకరాల వరకు సాగు చేయగల భూమి -మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సరైన జతలను ఎంపిక చేయండి?
ఎ) బి, సి బి) ఎ, సి
సి) ఎ డి) బి
3. కింది సాగునీటి పథకాల్లో ఏవి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి?
ఎ) చనాకా- కొరాటా ప్రాజెక్టు
2) మత్తడి వాగు ప్రాజెక్టు
3) నీల్వాయి ప్రాజెక్టు
డి) సదర్మట్ ప్రాజెక్టు
ఇ) సాత్నాలా ప్రాజెక్టు
సరైన జవాబును ఎంపిక చేయండి?
1) సి, డి, ఇ 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి, ఇ 4) ఎ, బి, ఇ
4. 2011 జనాభా లెక్కలు, తెలంగాణ ప్రభుత్వం ప్రకారం లింగ నిష్పత్తి గురించి కింది వివరణలను పరిశీలించండి?
ఎ) తెలంగాణలో 2011లో లింగనిష్పత్తి 988 అంటే అది స్త్రీలకు అనుకూలంగా లేదని సూచిస్తుంది
బి) జిల్లాల వారీ లైంగిక నిష్పత్తి ప్రకారం తెలంగాణలోని 11 జిల్లాల్లో పురుష జనాభా కంటే స్త్రీ జనాభా అధికంగా ఉంది
సి) 13 జిల్లాల్లో లైంగిక నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది
డి) 21 జిల్లాల్లో లైంగిక నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉంది సరైన జవాబును ఎంపిక చేయండి.
బి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, సి
5. భూ పంపిణీ, భూ శాసనం అమలును సమీక్షించడానికి 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది?
1) సి.హెచ్. హనుమంతరావు కమిటీ
2) జయతి ఘోష్ కమిటీ
3) రోశయ్య కమిటీ
4) కోనేరు రంగారావు కమిటీ
6. 2011 జనాభా గణాంకాలు, తెలంగాణ ప్రభుత్వం ప్రకారం తెలంగాణలోని కింది జిల్లాల్లో ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం (2016-17 ) రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే అధికంగా ఉంది. ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం ఆధారంగా కింది జిల్లాలను అవరోహణ క్రమంలో అమర్చండి.
ఎ) హైదరాబాద్
బి) మేడ్చల్ మల్కాజిగిరి
సి) రంగారెడ్డి డి) సంగారెడ్డి
1) డి, బి, ఎ, సి 2) సి, ఎ, బి, డి
3) ఎ, సి, బి, డి 4) బి, ఎ, సి, డి
7. సాలార్జంగ్ సంస్కరణలకు పూర్వం నిజాం పాలనలో 1853 వరకు తాలూకాదారులు వసూలు చేసే శిస్తులో ఎంత భాగం వేతనంగా చెల్లించడానికి ప్రభుత్వం అనుమతించింది?
1) భూమి శిస్తులో 1/8వ వంతు
2) భూమి శిస్తులో 1/4వ వంతు
3) భూమి శిస్తులో 1/6వ వంతు
4) భూమి శిస్తులో 1/5వ వంతు
8. తెలంగాణ గ్రామ జ్యోతి స్కీం గురించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
ఎ) 2015, ఆగస్టు 17 న ఈ స్కీంను ప్రారంభించారు
బి) ఈ స్కీం గ్రామాల సాధికారతకు సంబంధించినది
సి) నిజామాబాద్ జిల్లా మోతె గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు
డి) ప్రణాళికా రచన, సామూహిక నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యంతో సమ్మిళిత, సంపూర్ణమైన గ్రామ అభివృద్ధి ఈ స్కీం ముఖ్య ఉద్దేశాల్లో ఒకటిసరైన జవాబును ఎంపిక చేయండి
1) బి, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, డి 4) ఎ, బి, సి
9. కింది వాటిని జతపరచండి?
పథకం / పాలసీ అమలు పరిచిన తేదీ
1) టీఎస్ ఐపాస్ 1) జనవరి 1, 2015
2) షీ టీం 2) అక్టోబర్ 2, 2014
సి) ఆరోగ్య లక్ష్మి 3) జూన్ 12 2014
డి) హరిత హారం
4) అక్టోబర్ 24, 2014
ఇ) షాదీముబారక్ 5) ఏప్రిల్ 1, 2016
6) జూలై 3, 2015
1) ఎ-4, బి-6, సి-2, డి-5, ఇ-3
2) ఎ-2, బి-5, సి-3, డి-6, ఇ-1
3) ఎ-5, బి-4, సి-1, డి-6, ఇ-2
4) ఎ-3, బి-5, సి-1, డి-6, ఇ-2
10. కింది వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సబ్సిడీలపై గొర్రెలు పెంచే కుటుంబాలకు గొర్రెల పంపిణీకి సంబంధించినవి.
ఎ) 2017, జూన్ 2న ఈ స్కీం
ప్రారంభించారు
బి) ఈ పథకాన్ని కొండపాక గ్రామం
సిద్దిపేట జిల్లాలో ప్రారంభించారు
సి) ఈ స్కీం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు
డి) గొర్రెలకు సంబంధించి ఆరోగ్యపరమైన సమస్యలకు టోల్‌ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 2017
సరికాని వ్యాఖ్యలను ఎంపిక చేయండి?
1) ఎ, డి 2) బి, సి, డి
3) ఎ, సి 4) బి, డి
11. బర్రెల పంపిణీ స్కీం గురించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
ఎ) ఈ స్కీం పాడి రైతులకు బర్రెల
పంపిణీకి సంబంధించింది. ఇది
తెలంగాణ ప్రభుత్వం ఆమోదం పొంది, 2018-19 నుంచి అమల్లోకి వచ్చింది
బి) అందరు లబ్ధిదారులకు యూనిట్ ఖర్చుపైన 50 శాతం సబ్సిడీ ఇస్తారు
సి) సుమారు రెండు లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు
డి) రవాణా ఖర్చు రూ.5,000 కాకుండా ఒక బర్రె యూనిట్
ఖర్చు రూ.60,000లకు మించకూడదు
సరైన జవాబును ఎంపిక చేయండి
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, సి 4 ) బి, డి
12. ఎంత ఆర్థిక వ్యయంతో సమీకృత మత్స్య అభివృద్ధి స్కీం (IFDS)ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది?
1) రూ.10,000 కోట్లు
2) రూ.15,600 కోట్లు
3) రూ.5,500 కోట్లు
4) రూ.6,800 కోట్లు
13. తెలంగాణ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం గురించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
ఎ) దీన్ని తెలంగాణ పల్లె ప్రగతి పథకం అని కూడా పిలుస్తారు
బి) చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ కుంటుంబాలు ఈ స్కీం వల్ల లబ్ధి పొందుతారు
సి) తెలంగాణ రాష్ట్ర సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ’ (SERP) ఈ పథకాన్ని అమలు చేస్తుంది
డి) ప్రపంచ బ్యాంకు ఈ పథకానికి గాను తెలంగాణ రాష్ర్టానికి రుణాన్ని ఇవ్వడానికి అనుమతిని ఇచ్చింది
సరైన జవాబును ఎంపిక చేయండి?
1) ఎ, డి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, సి 4) బి, సి, డి
14. మిషన్ కాకతీయ గురించి కింద ఇచ్చిన వ్యాఖ్యలను పరిశీలించండి?
ఎ) ఇది తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ పథకం
బి) సదాశివనగర్‌లో 2015,
మార్చి 12 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించాడు
సి) ఈ పథకం ద్వారా 46,531 చెరువులను 5 సంవత్సరాల్లో పునరుద్ధరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది
డి) దీన్ని మన ఊరు- మన చెరువు అని కూడా పిలుస్తారు
కింది వాటిలో సరైన జవాబును ఎంపిక చేయండి?
1) బి, సి 2) ఎ, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి,
15. తెలంగాణ రాష్ర్టానికి సంబంధించిన కింది జతలను పరిశీలించండి?
1) టి- హెచ్ఏఆర్టీ (T-HART): తెలంగాణ తోటల పెంపకం, వ్యవసాయ పరిశోధన, శిక్షణ.
2) టి- అసిస్ట్ (T-ASSIT): చిన్న తరహా పరిశ్రమల నైపుణ్యాల టెక్నాలజీ వేగవంతం చేయడం
3) టి- అసిస్ట్ (T-ASSIT): తెలంగాణ అడ్వాన్స్డ్ సాలిడ్ స్టేట్ ఇల్యూమినేషన్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్
డి) రిచ్(RICH): హైదరాబాద్ పరిశోధన, ఆవిష్కణ సర్కిల్
సరైన జవాబును గుర్తించండి?
1) ఎ, సి 2) బి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
16. కింది జిల్లాల్లో ఉత్తర తెలంగాణ వ్యవసాయ శీతోష్ణస్థితి మండలం(జోన్) పరిధిలోకి రాని జిల్లా?
1) నిర్మల్
2) సిద్దిపేట
3) నిజామాబాద్
4) రాజన్న సిరిసిల్ల
17. తెలంగాణలోని జాతీయ రహదారులకు సంబంధించి కింది వివరణలను పరిశీలించండి?
ఎ) రాష్ట్రంలో 17 జాతీయ రహదారులు ఉన్నాయి
బి) రాష్ట్రంలో ఉన్న అన్ని జాతీయ రహదారులు కలిపి మొత్తం 3,862 కి.మీ. (దాదాపు) పొడవును కలిగి ఉన్నాయి.
సి) తెలంగాణలో నోటిఫైడ్ జాతీయ రహదారుల సాంద్రత 100 చ.కి.మీ కాగా జాతీయ స్థాయిలో సగటు సాంద్రత 3.02 కి.మీ. ఉంది
సరైన వివరణలను ఎంపిక చేయండి?
1) ఎ, బి 2) బి, సి
3) ఎ 4) ఎ, సి
18. కింది వివరణలను పరిశీలించండి?
ఎ) తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 100 శాతం ఇన్పుట్ సబ్సిడీ పథకం వల్ల షెడ్యూల్డ్ కులాలు/ షెడ్యూల్డ్ వర్గాలకు చెందిన ప్రజలు లక్ష రూపాయల వరకు పొందుతారు
బి) భూమి లేని షెడ్యూల్డ్ కులాల/ షెడ్యూల్డ్ తెగల మహిళలకు 3 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి కేటాయింపు చేయడం తెలంగాణ ప్రభుత్వం
భూ పంపిణీ పథకం లక్ష్యం
పై వాటిలో సరైన జవాబు ఏది?
1) ఎ, బి రెండూ సరైనవి
2) ఎ, బి రెండూ సరైనవి కాదు
3) ఎ మాత్రమే సరైనది
4) బి మాత్రమే సరైనది
19. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కింది పథకాలను అవి ఆరంభించిన ప్రదేశం/ప్రాంతంతో జతపరచండి?
ఎ) అసరా పెన్షన్ 1) కొత్తూరు
బి) మిషన్ భగీరథ 2) గంగదేవిపల్లి
సి) గ్రామజ్యోతి 3) సదాశివ నగర్
డి) మిషన్ కాకతీయ 4) కోమటిబండ
1) ఎ-1, బి-4, సి-2, డి-3
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-1, బి-3, సి-4, డి-2
20. ప్రతిపాదన (ఎ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని 2015లో ప్రారంభించింది.
కారణం(ఆర్): దీనివల్ల ఇప్పటి వరకు 32.7 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు.
1) (ఎ), (ఆర్) కరెక్టు,
(ఆర్) (ఎ) కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) కరెక్టు,
కానీ (ఆర్) (ఎ) కు సరైన వివరణ కాదు
3) (ఆర్) కరెక్టు, కానీ (ఆర్) తప్పు
4) (ఎ) తప్పు, కానీ (ఆర్) కరెక్టు
21. నేషనల్ శాంపిల్ సర్వే 70వ రౌండు ప్రకారం తెలంగాణలో రైతులు రుణాన్ని ఎంత శాతంగా గుర్తించారు?
1) 60 శాతం 2) 74 శాతం
3) 50 శాతం 4) 89 శాతం