హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీ ఎన్బీఏ గుర్తింపుకోసం దరఖాస్తు చేసింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపునకు కాలేజీ ఇటీవలే దరఖాస్తు సమర్పించింది. ఎన్బీఏ గుర్తింపు దక్కిన తర్వాత ఇంజినీరింగ్ కాలేజీలో సెమికండక్టర్ కోర్సును వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెడతారు. బీటెక్ వీఎల్ఎస్ఐ పేరుతో కొత్త కోర్సు ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తెలిపారు.
ఈసీఈ కోర్సులో మరో సెక్షన్ను ప్రారంభించనున్నామని తెలిపారు. 60 సీట్లతో మరో సెక్షన్ వచ్చే విద్యాసంవత్సరం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ కోర్సులో 50 నుంచి 60 సీట్లకు, బయోమెడికల్ ఇంజినీరింగ్లో సీట్లను 30 నుంచి 60కి పెంచనున్నట్టు వెల్లడించారు.