Osmania University | బీఈ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈ (ఏఐసీటీఈ) రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్, బీఈ (సీబీసీఎస్), బీఈ (నాన్ సీబీసీఎస్) బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఈ నెల 13వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈ (ఏఐసీటీఈ) రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్, బీఈ (సీబీసీఎస్), బీఈ (నాన్ సీబీసీఎస్) బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఈ నెల 13వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు.
రూ. 200 అపరాధ రుసుముతో 17వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.
బీఈ కోర్సుల వన్‌టైమ్ ఛాన్స్ పరీక్షా ఫీజు స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని విభాగాల బీఈ కోర్సులు పూర్తి చేసి బ్యాక్లాగ్ సబ్జెక్టులు మిగిలిపోయిన వారికి వన్ టైమ్ చాన్స్ కల్పించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఓయూ అకాడమిక్ సెనేట్ స్టాండింగ్ కమిటీ అనుమతించిందని చెప్పారు. 2000 సంవత్సరం తరువాత ఆయా కోర్సుల్లో చేరినవారు సైతం తమ బ్యాక్ లాగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశమిచ్చామని తెలిపారు. ఈ కోర్సుల అన్ని సెమిస్టర్ల పరీక్షా ఫీజును ఈ నెల 13వ తేదీలోగా చెల్లించాలని సూచించారు. రూ.200 అపరాధ రుసుముతో కలిపి 17వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని తెలిపారు.
అన్ని కోర్సుల పరీక్షలకు సాధారణ పరీక్షా ఫీజుతో పాటు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న సిలబస్, పరీక్షా విధానంలోనే వారు పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

