హైదరాబాద్: దేశంలో ప్రముఖ చమురు ఉత్పత్తిదారైన ఆయిల్ ఇండియా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 120 జూనియర్ అసిస్టెంట్ (క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్) పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైనవారు అసోంలోని డిబ్రూగఢ్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
పోస్టుపేరు: జూనియర్ అసిస్టెంట్
మొత్తం పోస్టులు: 120
ఇందులో జనరల్ 54, ఓబీసీ 32, ఈడబ్ల్యూఎస్ 12, ఎస్సీ 8, ఎస్టీ 14 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: 40 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ఎమ్మెస్ వర్డ్, ఎమ్మెస్ ఎక్సెల్, ఎమ్మెస్ పవర్‌పాయింట్ వచ్చి 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా (సీబీటీ)
అప్లికేషన్ ఫీజు: రూ.200, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: జూలై 1
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 15
వెబ్సైట్: https://www.oil-india.com