ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్
G-20 దేశాల 18వ సమావేశం ఇది. జరిగిన తేదీలు: 2023 సెప్టెంబర్ 9-10
గ్రూప్స్ ప్రత్యేకం కరెంట్ అఫైర్స్
జీ20 -2023
- G-20 దేశాల 18వ సమావేశం ఇది.
- జరిగిన తేదీలు: 2023 సెప్టెంబర్ 9-10
- వేదిక: భారత మండపం, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్ (ఐఈసీసీ) ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ.
- భారతదేశం జీ20 సమావేశాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి.
- ఈ జీ 20 సమావేశాన్ని భారతదేశం 2021 లో, ఇటలీ 2022లో నిర్వహించాల్సింది. కానీ 2018లో అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ 2022లో భారత స్వాతంత్య్రానికి 75 సం.లు పూర్తవుతున్న సందర్భంగా తమకు 2022లో నిర్వహణ బాధ్యతలు ఇవ్వాలని కోరగా ఇటలీ అంగీకరించింది.
- 2023లో ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (ASEAN) సమావేశాన్ని ఇండోనేషియా నిర్వహించాల్సి ఉండటంతో ఒకేసారి జీ 20, ఏషియన్ సమావేశాన్ని నిర్వహించలేమని ఇండోనేషియా విదేశాంగ శాఖమంత్రి రెట్నో మర్సుది భారత్‌ను 2022 జీ 20 సమావేశాన్ని నిర్వహించే బాధ్యతను ఇవ్వవల సిందిగా కోరడంతో 2022 సమావేశాన్ని ఇండోనేషియా, 2023 సమావేశాన్ని భారత్ నిర్వహించాయి.
- ఇతివృత్తం: ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ One Earth, One Family, One Future
- ఈ ఇతివృత్తం లోగో అండ్ వెబ్‌సైట్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ 2022, నవంబర్ 8న న్యూఢిల్లీలో విడుదల చేశారు.
- ఇతివృత్తాన్ని మహా ఉపనిషత్ నుంచి తీసుకున్నారు.
- జీ 20 అధ్యక్ష బాధ్యతల్లో అగ్ర దేశాలైన నాయకులు ఇంతపెద్ద ఎత్తున భారత్‌లోకి వచ్చి సమావేశం అవడం స్వాతంత్య్రం తర్వాత ఇదే తొలిసారి. ఈ సమావేశంలో 14 దేశాల అధ్యక్షులు/ప్రధానులు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి భారత్ ఆహ్వానించిన అతిథులు
బంగ్లాదేశ్ నైజీరియా
కామెరూన్ ఒమన్
ఈజిప్ట్ సింగపూర్
మారిషస్ స్పెయిన్
నెదర్లాండ్స్ యూఏఈ
ఈ సమావేశానికి హాజరైన అంతర్జాతీయ సంస్థలు
- ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ)
- ప్రపంచబ్యాంక్
- అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)
- అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)
- అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ)
- ఫెనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్
- ఐక్యరాజ్యసమితి , ఓఈసీడీ
- ఈ సమావేశానికి సభ్యదేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరు కాలేదు. అతని తరఫున రష్యా విదేశాంగ శాఖమంత్రి సెర్గీ లావ్రోన్ & చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తరఫున చైనా ప్రధాని లీ కెకియాంగ్లు హాజరయ్యారు.
- సమావేశం ప్రారంభించి, ప్రారంభోపన్యాసం ఇచ్చినది. నరేంద్ర మోదీ (వసుధైక కుటుంబం)
- మొదటి రోజున న్యూఢిల్లీ జీ20 లీడర్స్ డిక్లరేషన్ (ఎన్డీఎల్డీ)ను ఏకగ్రీవంగాఆమోదించారు.
- ఈ సమావేశానికి సుమారు 10,000 మంది, 135 దేశాల నుంచి హాజరయ్యారు.
- ఈ సమావేశానికి 9 ఆహ్వానిత దేశాలు, 14 అంతర్జాతీయ సంస్థలు హాజరయ్యాయి.
- దీనికి 27 దేశాధినేతలు, నలుగురు మంత్రుల స్థాయి 11 మంది అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరయ్యారు.
చర్చించిన అంశాలు
1) ఉక్రెయిన్ పై రష్యా దాడి
2) ఆఫ్రికన్ యూనియన్ సభ్యత్వం
3) ఎస్‌డీజీలపై పురోగతిని వేగవంతం చేయడానికి జీ20 2023 కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడం
4. 2024లో ైక్లెమేట్ ఫైనాన్స్ ప్రతిష్ఠాత్మకమైన, పారదర్శకమైన, ట్రాక్ చేయగలిగే కొత్త కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్(ఎస్సీఏసీ)ని సంవత్సరానికి 100 బిలియన్ డాలర్లతో ఏర్పాటుకు అంగీకరించారు.
5. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక శక్తిని 3 రెట్లు పెంచేందుకు అంగీకారం.
6. ప్రపంచ ఆహార భద్రతను మెరుగుపర్చడం, మిల్లెట్ రీసెర్చ్ కార్యక్రమం ఆమోదం.
7. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కోసం డిజిటల్ హెల్త్ పై గ్లోబల్ ఇనిషియేటివ్ ఆమోదం.
సంప్రదాయ ఔషధాల గుర్తింపు, జామ్ నగర్లో కేంద్రం డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు.
MAHARSHI
Millets and other Ancient Grains International Research Initiative
జీ-20 దేశాల 100వ సమావేశం సందర్భంగా, వ్యవసాయ ముఖ్య శాస్త్రవేత్తల సమావేశం 2023 ఏప్రిల్ 19న జరిగింది. ఈ సందర్భంగా దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి ప్రారంభించాలని నిర్ణయించారు. (ఈ 100 వ సమావేశం వారణాసిలో జరిగింది) దీని కార్యాలయం హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) లో ఏర్పాటు చేసి ఇక్రిశాట్ నుంచి సాంకేతిక సహకారాన్ని తీసుకొంటారు.
జీ20 out come Documents
- ఆహార భద్రత, పోషకాహారంపై దక్కన్ ఉన్నత స్థాయి సూత్రాలు, సముద్ర నీలి ఆర్థికంపై చెన్నై ఉన్నత స్థాయి సూత్రాలు పర్యాటకం కోసం గోవా రోడ్ మ్యాప్.
- భూమి పునరుద్ధరణ కోసం గాంధీ నగర్ రోడ్‌మ్యాప్ అమలు ఎంఎస్ఎంఈల మెరుగుకోసం జైపూర్ కాల్
- కాశీ సాంస్కృతిక మార్గం.
- కొత్తగా ప్రవేశ పెట్టిన కార్యక్రమాలు:
- విపత్తు ప్రమాద తగ్గింపు వర్కింగ్ గ్రూప్
- స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్
- ముఖ్య శాస్త్రీయ సలహాదారుల రౌండ్‌టేబుల్
- Non-fungible Tokens యుగంలో నేరం, భద్రతపై జీ 20 సమావేశం
- మహిళా సాధికారతపై కొత్త వర్కింగ్ గ్రూప్ (Agreed)
- కౌంటర్ నార్కోటిక్స్‌లో సహకారం
- సంప్రదాయ ఔషధాల్లో సహకారం
- తృణధాన్యాల అధ్యయన కార్యక్రమం
జీ20 సాధించిన విజయాలు గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ (జీబీఏ)
- దీన్ని 2023, సెప్టెంబర్ 9న భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.
- ప్రారంభ దేశాలు
1) అర్జెంటీనా 2) బ్రెజిల్
3) భారతదేశం 4) ఇటలీ
5) కెనడా 6) దక్షిణాఫ్రికా
7) జపాన్ 8) యూఎస్ఏ - ప్రస్తుతం జీబీఏలో 22 దేశాలు +12 అంతర్జాతీయ సంస్థలు సభ్యులుగా ఉన్నాయి.
- పరిశీలక దేశాలు
1) మారిషస్ 2) బంగ్లాదేశ్
3) యూఏఈ 4) సింగపూర్ - ప్రస్తుతం: ఎనిమిది జీ 20 దేశాలు + నాలుగు జీ20 ఆహ్వానిత దేశాలు
- 10 జీ20 కాని దేశాలు + 12 అంతర్జాతీయ సంస్థలు సభ్యులుగా ఉన్నాయి.
- జీవ ఇంధనాలు సాధారణంగా బయోమాస్, సహజ వ్యర్థాలు వంటి సేంద్రీయ పదార్థాలను ఉపయోగించి సృష్టించబడిన ద్రవ ఇంధనాలు, జీవ ఇంధనాలు తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు చెరుకు, మొక్కజొన్న, సోయాబీన్స్.
India Middle East Europe Economic Corridor (IMEC)
- ఆర్థికాభివృద్ధికి సహకరించేలా దీన్ని 2023 సెప్టెంబర్ 9న జీ 20 సమావేశంలో భాగంగా దీనిపై ఒప్పందం కుదుర్చుకొన్నారు.
- ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలు
1) భారతదేశం 2) ఈయూ
3) జర్మనీ 4) ఇటలీ
5) ఫ్రాన్స్ 6) యూఎస్ఏ
7) సౌదీ అరేబియా 8) యూఏఈ - ఐఎంఈసీ (IMEC)లో రైల్వేలైన్లు, సముద్ర మార్గాలు, రోడ్ నెట్వర్క్ కలిగి ఉంటుంది.
- IMEC లో 2 కారిడార్లు ఉంటాయి.
1) తూర్పు కారిడార్ 2) ఉత్తర కారిడార్ - తూర్పు కారిడార్ భారత్, అరేబియన్ గల్ఫ్‌ను కలుపుతుంది
- ఉత్తర కారిడార్ అరేబియన్ గల్ఫ్, యూరప్‌ను కలుపుతుంది.
- ఇండియా బ్రెజిల్-దక్షిణాఫ్రికా అమెరికా సమావేశం
- జీ20 సమావేశాన్ని 2023లో నిర్వహించిన భారత్‌తోపాటు 2024, 2025, 2026లో నిర్వహించే దేశాలు సమావేశమయ్యాయి. ప్రపంచబ్యాంక్ సహకారంతో పెద్ద, మెరుగైన, ప్రభావవంతమైన మల్టీ లేటరల్ అభివృద్ధి బ్యాంక్‌లను ఏర్పాటు చేసుకోవడం.
గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం భాగస్వామ్యం (పీజీఐ)
- దీని కింద జీ 7 కూటమి 2027 నాటికి గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 600 బిలియన్ డాలర్లు సమీకరించుకోవాలనేది లక్ష్యం. ఇందులో ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటుంది.
- భారతదేశంలో పీజీఐ ప్రాజెక్ట్‌లో ఆరోగ్యం, టెలీకం, పునరుత్పాదక ఇంధన రంగాలు ఉన్నాయి.
- సమావేశాలు-వేదికలు
- మొత్తం వర్కింగ్ గ్రూపులు షెర్పా, మంత్రుల స్థాయి సమావేశాలు 106
- ఎంగేజ్మెంట్ గ్రూపులు, కార్యక్రమాల సమావేశాలు 47
- అనుబంధ సమాంతర జీ 20 సమావేశాలు 74
మొత్తం 227 - ఈ సమావేశాలు 28 రాష్ర్టాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 60 నగరాల్లో జరిగాయి. అత్యధిక సమావేశాలు గుజరాత్ (24), మహారాష్ట్ర (24), కర్ణాటక (22).
- విశాఖపట్నంలో జరిగిన జీ 20 సమావేశం
- 2వ మౌలిక సదుపాయాల వర్కింగ్ గ్రూప్ సమావేశం.
- తేదీ: మార్చి 28-29, 2023న జరిగింది.
- ఇతివృత్తం: Financing Cities of Tomorrow: Inclusive, Resilient and Sustainable
- దీన్ని భారతదేశం, ఆస్ట్రేలియా, బ్రెజిల్ నిర్వహించాయి.
- దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నిర్వహించింది.
- 57 మంది ప్రతినిధులు 14 జీ 20 దేశాల నుంచి హాజరయ్యారు.
- దీనిలో భాగంగా Infrastructure Taxonomics సమావేశం కూడా జరిగింది.
- జీ 20 ప్రారంభ సమావేశం : 2022 నవంబర్ 26, 27 అండమాన్
- జీ 20 తొలి షెర్పా సమావేశం 2022 డిసెంబర్ 4-7 ఉదయపూర్
- తెలంగాణలో 10 సమావేశాలు ఏపీలో 2 సమావేశాలు జరిగాయి.
- షెర్పా ట్రాక్ -13, ఫైనాన్స్ ట్రాక్ -8, ఎంగేజ్మెంట్ గ్రూప్స్-1, ఇనిషియేటివ్స్-6, స్టాండ్ ఎలోన్ మినిస్టర్స్ మీటింగ్స్ -2
- జీ20 ను 1997-98లో ఆసియాలో సంభవించిన ఆర్థిక సంక్షోభం కారణంగా 1999లో ఆర్థిక మంత్రులు, కేంద్రబ్యాంక్ గవర్నర్లతో పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలతో ప్రపంచ ఆర్థిక స్థిరత్వం కోసం ఏర్పాటు చేశారు.
- 2007 ఆర్థిక సంక్షోభంతో 2009 నుంచి సమావేశాలు నిర్వహించుకుంటుంది.
- సభ్యులు : 21,
- 85 శాతం గ్లోబల్ జీడీపీ
- 75 శాతం వరల్డ్ ట్రేడ్
- 2/3 వంతు వరల్డ్ పాపులేషన్
తాన్న రవి ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీసర్కిల్ , వికారాబాద్
91107 62187
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Current Affairs
- g20
- IMEC
- Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

