న్యూఢిల్లీ: డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సెంటర్ ఫర్ పర్సనల్ ట్యాలెంట్ మేనేజ్మెంట్ (సెప్టమ్) డిఫెన్స్ రిసెర్చ్ టెక్నికల్ క్యాడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైనవారు వచ్చేనెల 3 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 1901 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బీ, టెక్నీషియన్-ఏ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసినవారు ఈ పోస్టులకు అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 1901
ఇందులో టెక్నికల్ అసిస్టెంట్-బీ కేటగిరీ పోస్టులు 1075, టెక్నీషియన్-ఏ కేటగిరీ పోస్టులు 826 చొప్పున ఉన్నాయి.
టెక్నికల్ అసిస్టెంట్-బీ విభాగంలో.. అగ్రికల్చర్ 10, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ 15, బోటనీ 3, కెమికల్ ఇంజినీరింగ్ 35, కెమిస్ట్రీ 58, సివిల్ ఇంజినీరింగ్ 25, కంప్యూటర్ సైన్స్ 167, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 17, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 68, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 31, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 192, ఇన్స్ట్రుమెంటేషన్ 17, లైబ్రరీ సైన్స్ 23, మ్యాథమెటిక్స్ 13, మెకానికల్ ఇంజినీరింగ్ 294, మెటల్లర్జీ 21, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ 16, ఫొటోగ్రఫీ 8, ఫిజిక్స్ 32, ప్రింటింగ్ టెక్నాలజీ 5, సైకాలజీ 11, టెక్స్టైల్ 5, జువాలజీ 9 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, డిప్లొమా చేసి ఉండాలి.
టెక్నీషియన్-ఏ కేటగిరీ పోస్టులు.. ఆటోమొబైల్ 5, బుక్ బైండర్ 20, కార్పెంటర్ 12, సీఎన్ఎస్ ఆపరేటర్ 9, కోపా 139, ట్రాట్స్మెన్ మెకానికల్ 35, డీటీపీ ఆపరేటర్ 8, ఎలక్ట్రిషియన్ 106, ఎలక్ట్రానిక్స్ 113, ఫిట్టర్ 127, గ్రైండర్ 7, మెషినిస్ట్ 89, మెకానిక్ 4, మిల్ వ్రైట్ మెకానిక్ 8, మోటార్ మెకానిక్ 13, పెయింటర్ 3, ఫొటోగ్రాఫర్ 11, ఫ్రిజ్-ఏసీ 8, షీట్ మెటల్ వర్కర్ 14, టర్నర్ 45, వెల్డర్ 50 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: పదోతరగతి పాసై సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయస్సు: 18 నుంచి 28 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 3
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 23
వెబ్సైట్: www.drdo.gov.in