మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో 502 పోస్టులు

హైదరాబాద్: ఇండియన్ ఆర్మీలోని ఇంజినీరింగ్ విభాగమైన మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చే నెల 12 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 502 డ్రాట్స్‌మ్యాన్, సూపర్వైజర్ బ్యారక్ స్టోర్ పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తుంది.
మొత్తం పోస్టులు: 502
ఇందులో డ్రాట్స్‌మ్యాన్-52, సూపర్వైజర్ 450 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: డ్రాట్స్‌మ్యాన్ పోస్టులకు ఆర్కిటెక్చురల్ అసిస్టెంట్‌షిప్‌లో మూడేండ్ల డిప్లొమా చేసి ఉండాలి. సూపర్వైజర్ పోస్టులకు ఎకనమిక్స్, కామర్స్, స్టాటిస్టిక్స్, బిజినెస్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. దీంతోపాటు సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా. పరీక్షలో 50 శాతం మార్కులు తప్పనిసరిగా రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు రావాలి.
అప్లికేషన్ ఫీజు: రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 12
రాత పరీక్ష: మే 16
వెబ్సైట్: https://mes.gov.in లేదా https://www.mesgovonline.com
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

