హైదరాబాద్: మెదక్ జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దవాఖానలో వైద్య నిపుణుల నియామకానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీచేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆరు నెలల కాలానికి వైద్యులను నియమిస్తున్నారు. ఈ పోస్టులకు ఎంపికైనవారు.. అవసరానికనుగుణంగా క్యాంపస్‌లోనే ఉండాల్సి ఉంటుందని, వైద్యులకు తగిన వసతి కల్పిస్తామని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అధికారులు వెల్లడించారు. ఎంబీబీఎస్ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 040 23283480, మొబైల్ నంబర్ 8332999339లో సంప్రదించవచ్చన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి