CUET PG Notification 2023 | సీయూఈటీ -2023
CUET PG Notification 2023 | దేశవ్యాప్తంగా పేరుగాంచిన సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలతో పాటు పలు ప్రైవేట్ విద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2023 నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలు సంక్షిప్తంగా....
CUET PG Notification 2023 | దేశవ్యాప్తంగా పేరుగాంచిన సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలతో పాటు పలు ప్రైవేట్ విద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2023 నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలు సంక్షిప్తంగా….
పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ప్రవేశాలు
142 యూనివర్సిటీలు.. వందకు పైగా కోర్సులు
పరీక్ష పేరు: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2023
కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంపీఏ, ఎంబీఏ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంకాం, శిక్షా శాస్త్రి (బీఈడీ), డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్, ఆంత్రోపాలజీ, ఎంఐఎల్ఎస్సీ, ఎంటెక్, ఎంఎఫ్ఏ, ఎంవీఏ, ఎంఏ (జాగ్రఫీ, జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్), ఎంటెక్ (ఐవోటీ, వీఎల్ఎస్ఐ తదితరాలు), ఎమ్మెస్సీ (సాయిల్ సైన్స్ అండ్ వాటర్ కన్జర్వేషన్) తదితరాలు
ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు: దేశవ్యాప్తంగా 142 విద్యాసంస్థలు ఈ పరీక్ష ద్వారా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి. వాటిలో కొన్ని… బాబా సాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ, బీహెచ్‌యూ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ (ఏపీ, గుజరాత్, హర్యానా, జమ్ము, జార్ఖండ్, కర్ణాటక, కశ్మీర్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు), ఐజీఎన్‌టీయూ, హేమవతి నందన్ బహుగుణ గర్వాల్, జేఎన్‌యూ, మణిపూర్ యూనివర్సిటీ, పాండిచ్చేరి యూనివర్సిటీ, సిక్కిం యూనివర్సిటీ, డా.బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీ, గతిశక్తి విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, డీటీయూ, నిక్మార్, మేవార్, ఐఐఎంటీ గ్లోబల్ యూనివర్సిటీ, విశ్వభారతి యూనివర్సిటీ, అస్సాం యూనివర్సిటీ, ఐఐఐటీ లక్నో, ఐఐటీటీఎం (నోయిడా, భువనేశ్వర్, నెల్లూరు, గోవా), బీఎంఎల్ ముంజల్ యూనివర్సిటీ, నిట్ తిరుచిరాపల్లి తదితరాలు
అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణులు. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నవారు/రాసినవారు అర్హులు. కొన్ని కోర్సులకు సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణత. మిగిలి అన్ని కోర్సులకు డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఆన్లైన్లో నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ స్కోర్ ద్వారా.
పరీక్షలో 100 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఏప్రిల్ 19 (సాయంత్రం 5 వరకు)
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సికింద్రాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.
వెబ్సైట్: https://cuet.nta.nic.in
కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

