న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైనవారు జనవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చేనెల 4 నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభంకానున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1458 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, దేహదారుఢ్య పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 1458
ఇందులో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్) 143, హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) 1315 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కలిగి 18 నుంచి 25 మధ్య వయస్సు వారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
అప్లికేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు లేదు
పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: 2023 జనవరి 4
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 25
అడ్మిట్‌కార్డు విడుదల: ఫిబ్రవరి 15
పరీక్ష: ఫిబ్రవరి 22 నుంచి 28 మధ్య
వెబ్సైట్: www.crpf.nic.in