న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 8 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ పూర్తిచేసినవారు ఈ అప్రెంటిస్లకు అర్హులు. మొత్తం 102 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. కొచ్చి రిఫైనరీలో ఈ అప్రెంటిస్లు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 102
ఇందులో కెమికల్ ఇంజినీరింగ్ 31, సివిల్ ఇంజినీరింగ్ 8, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 9, ఈఈఈ 5, సేఫ్టీ ఇంజినీరింగ్ 10, మెకానికల్ ఇంజినీరింగ్ 28, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 9, మెటల్లర్జీ ఇంజినీరింగ్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ పూర్తిచేసి, 18 నుంచి 27 ఏండ్ల లోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 8
వెబ్సైట్: www.mhrdnats.in