Telangana Inter Exams | ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షలు ఈ నెల 15న ప్రారంభమై, ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. మొత్తం 9,51,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
- 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు
- హాజరుకానున్న 9.51 లక్షల మంది విద్యార్థులు
- 1,473 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
Telangana Inter Exams | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షలు ఈ నెల 15న ప్రారంభమై, ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. మొత్తం 9,51,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 9.06 లక్షల రెగ్యులర్ విద్యార్థులుండగా, మరో 45 వేలు ప్రైవేట్ విద్యార్థులున్నారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే కాలేజీ లాగిన్ ఐడీలో విద్యార్థుల హాల్‌టికెట్లను విడుదల చేశారు. సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలను నిర్వహిస్తారు. ప్రశ్నపత్నాలను తెరవడం.. ఆన్సర్‌షీట్లను నింపే ప్రక్రియనంతా సీసీ కెమెరాలో రికార్డు చేస్తారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
53 వేల మంది విద్యార్థులు ఫీజు చెల్లించలేదు
ఇంటర్లో ఈ ఏడాది 53,162 విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించలేదు. వీరంతా అడ్మిషన్లు పొందినా ఆన్లైన్లో తమ పేర్లను నమోదుచేసుకున్నా పరీక్ష ఫీజు చెల్లించలేకపోయారు. ఇలాంటి వారు ఫస్టియర్‌లో 16,191 మంది విద్యార్థులు కాగా, సెకండియర్‌లో 36, 971 మంది విద్యార్థులున్నారు. ఫీజు చెల్లించేందుకు ఇంటర్‌బోర్డు పలు మార్లు అవకాశం ఇచ్చింది. తత్కాల్ స్కీం కింద కూడా ఫీజు చెల్లించే వెసులుబాటు ఇచ్చింది. అయినా 53 వేలకు పైగా విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడం అధికారులను ఆశ్చర్యపరిచింది.
ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్
తేదీ(రోజు) పేపర్
15-3-2023 (బుధవారం) రెండోభాష పేపర్ -1
17-3-2023 (శుక్రవారం) ఆంగ్లం పేపర్ -1
20-3-2023 (సోమవారం) గణితం పేపర్ 1ఏ, బాటనీ పేపర్ -1,పొలిటికల్ సైన్స్ పేపర్ -1
23-3-2023 (గురువారం) గణితం పేపర్ 1బీ, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
25-3-2023 (శనివారం) ఫిజిక్స్ పేపర్ -1, ఎకనామిక్స్ పేపర్ -1
28- 3-2023 (మంగళవారం) కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1
31-3-2023 (శుక్రవారం) పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జికోర్సు గణితం పేపర్ -1 (బైపీసీ విద్యార్థులకు)
03-4-2023 (సోమవారం) మాడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -1, జాగ్రఫీ పేపర్ -01
సెకండియర్ పరీక్షల షెడ్యూల్
తేదీ (రోజు) పేపర్
16-3-2023(గురువారం) రెండోభాష పేపర్ -2
18-3-2023 (శనివారం) ఆంగ్లం పేపర్ -2
21-3-2023 (మంగళవారం) గణితం పేపర్ -2ఏ, బాటనీ పేపర్ -2, పొలిటికల్ సైన్స్ పేపర్ -2
24-3-2023 (శుక్రవారం) గణితం పేపర్ -2బీ, జువాలజీ పేపర్ -2, హిస్టరీ పేపర్ -2
27-3-2023 (సోమవారం) ఫిజిక్స్ పేపర్ -2, ఎకనామిక్స్ పేపర్ -2
29-3-2023 (బుధవారం) కెమిస్ట్రీ పేపర్ -2, కామర్స్ పేపర్ -2
1-4-2023 (శనివారం) పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బిడ్జ్రికోర్సు గణితం పేపర్ -2 (బైపీసీ విద్యార్థులకు)
4-4-2023 (మంగళవారం) మాడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -2, జాగ్రఫీ పేపర్ -2
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

