అంతర్రాష్ట్ర మండలిని ఎవరు ఏర్పాటు చేస్తారు? 1) ప్రధానమంత్రి 2) రాష్ట్రపతి 3) ఉపరాష్ట్రపతి 4) గవర్నర్
ఏ సందర్భంలో రాష్ట్రజాబితాలో పొందుపర్చిన అంశాలపై పార్లమెంటు చట్టం చేస్తుంది? 1) ఎమర్జెన్సీ కాలంలో 2) దేశ శ్రేయస్సు దృష్ట్యా రాజ్యసభ తీర్మానం చేసినప్పుడు 3) రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం ద్వారా చట్టం చేయమని పార్లమెంటును కోరడం ద్వారా 4) పైవన్నీ
ఉమ్మడి జాబితా అంటే ఏమిటి? 1) కేంద్రం మాత్రమే చట్టాలు చేయడానికి వీలైనది 2) రాష్ర్టాలు మాత్రమే చట్టాలు చేయడాని వీలైనది 3) పై రెండూ 4) ఏదీకాదు
జతపర్చండి 1) కేంద్రం విధించి, కేంద్రానికి చెందేపన్ను ఎ. కేంద్ర ఎక్సైజ్ పన్ను 2) రాష్ట్రం విధించి, రాష్ర్టానికి చెందే పన్ను బి. స్టాక్ ఎక్చ్సేంజ్లపై పన్ను 3) కేంద్ర, రాష్ర్టాల మధ్య పంచే పన్ను సి. కార్పొరేషన్ పన్ను 4) కేంద్రం విధించి వసూలు చేసి రాష్ర్టాలకు ఇచ్చే పన్ను డి. వినోదపు పన్ను 1) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి 2) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి 3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి 4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
కింది వాటిలోసంఘర్షణాత్మకమైనవి ఏవి? 1) గవర్నర్ పదవి 2) ఆల్ ఇండియా సర్వీసులు ఉండటం 3) పై రెండూ 4) ఏదీకాదు 6.జతపర్చండి 1) కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఎ. కస్టమ్స్ సుంకం 2) రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే బి. అమ్మకపు పన్ను 3) కేంద్ర, రాష్ర్టాల మధ్య పంపకం సి. కేంద్ర ఎక్సైజ్ పంపకం 4) కేంద్రం విధించగా రాష్ర్టాలు వసూలు చేసుకునేవి డి. మత్తుపదార్థాలు కలిగిన ఔషధాల పై పన్ను వసూలు చేసుకుంటాయి 1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి 3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి 4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
దేశంలో అతిపెద్ద పన్ను ఆధారం? 1) వ్యక్తిగత ఆదాయపన్ను 2) కార్పొరేట్ ఆదాయపన్ను/సంఘ సంబంధమైన పన్ను 3) ఎక్సైజ్ సుంకాలు 4) కస్టమ్స్ సుంకాలు
పరోక్ష పన్నులను సామాన్యులపై, సేవలపై విధిస్తారు? కింది వాటిలో పరోక్ష పన్ను కానిది? 1) కస్టమ్స్ సుంకం 2) అమ్మకపు పన్ను 3) ఎస్టేట్ సుంకం 4) ఎక్సైజ్ సుంకం
సర్కారియ కమిషన్ దేనికోసం నియమించారు? 1) ద్వంద్వ పౌరసత్వం 2) కేంద్ర, రాష్ట్ర సంబంధాలు 3) న్యాయసంస్కరణలు 4) పోలీసు పాలనా విషయాలు
కింది వాటిలో ప్రత్యక్ష పన్ను ఏది? 1) ఎస్టేట్ డ్యూటీ 2) ఎక్సైజ్ డ్యూటీ 3) సేల్స్ ట్యాక్స్ 4) ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్
కింది వాటిలో సరైనది? ఎ. ప్రకరణ 249 ప్రకారం జాతీయ ప్రయోజనాల కోసం రాజ్యసభ శాసనం చేయమని పార్లమెంటును కోరడం బి. ప్రకరణ 250 ప్రకారం రాష్ట్రపతి విధించిన అత్యవసర పరిస్థితి దేశంలో అమల్లో ఉన్నప్పుడు, రాష్ర్టాలకు సంబంధించిన అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఇవ్వడం సి. ప్రకరణ 252 ప్రకారం రెండు లేదా అంతకుమించిన రాష్ట్రశాసనశాఖలు ఉమ్మడి ప్రయోజనాల కోసం శాసనం చేయమని పార్లమెంటును కోరడం డి. ప్రకరణ 253 ప్రకారం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుకు రాష్ట్రజాబితాలోని అంశాలపై వైవిధ్యం ఉన్నప్పటికి పార్లమెంటు చట్టం చేస్తుంది 1) ఎ, బి 2) బి, సి 3) ఎ, బి, సి, డి 4) ఏదీకాదు
కార్పొరేషన్ పన్ను? 1) రాష్ర్టాలే విధించి వ్యయం చేసుకుంటాయి 2) కేంద్రం విధిస్తే రాష్ర్టాలు వసూలు చేసుకొని వ్యయం చేసుకుంటాయి 3) కేంద్రం విధిస్తే రాష్ర్టాలు కేంద్రం వాటా పంచుకుంటాయి 4) కేంద్రమే విధించి వసూలుచేసుకొని వ్యయం చేసుకుంటుంది
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నియమించేది ఎవరు? 1) కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2) రాష్ట్రపతి 3) ప్రధానమంత్రి 4) కేంద్రహోంమంత్రి
ఆల్కహాల్ ఔషధాలపై లభించే ఎక్సైజ్ పన్నుఎవరికి చెందుతుంది? 1) కేంద్రం 2) రాష్ట్రం 3) కేంద్ర, రాష్ర్టాలు 4)కేంద్రపాలిత ప్రాంతం
మాజీ కేంద్రమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను గవర్నర్లుగా నియమించరాదని సూచించిన కమిటీ? 1) సర్కారియా కమిషన్ 2) రాజమన్నార్ కమిటీ 3) ఆనందపూర్ సాహెబ్ తీర్మానం 4) ఏదీకాదు
కింది వాటిలో ఏడో షెడ్యూల్లోని కేంద్ర జాబితాలో ఉన్న అంశం? 1) గనులు, చమురు క్షేత్రాల్లో పనిచేసే శ్రామికులు, వారి భద్రతను క్రమబద్ధీకరించడం 2) వ్యవసాయం 3) మత్స్యపరిశ్రమ 4) ప్రజా ఆరోగ్యం
కింది వాటిని పరిశీలించండి? ఎ. దేశ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రజాబితాలోని అంశంపై పార్లమెంటు చట్టం చేసేందుకు తీర్మానం చేసే అధికారం రాజ్యసభకు మాత్రమే ఉంది బి. అత్యవసర పరిస్థితి విధించడానికి సంబంధించిన తీర్మానాలను లోక్సభ మాత్రమే ఆమోదిస్తుంది 1) ఎ సరైనది 2) బి సరైనది 3) రెండూ సరైనవే 4) రెండూ సరికావు
రాజ్యాంగం ప్రకారం కింద పేర్కొన్న వాటిలో సరికానిది? 1) అడవులు- ఉమ్మడి జాబితా 2) స్టాక్ ఎక్సేంజ్- ఉమ్మడి జాబితా 3) పోస్టాఫీస్ సేవింగ్స్- కేంద్ర జాబితా 4) ప్రజా ఆరోగ్యం- రాష్ట్ర జాబితా
కింది వ్యాఖ్యలను పరిశీలించండి? ఎ. భారత ప్రణాళికలను నిర్ణయించే అత్యున్నత సంస్థ భారత ప్రణాళికా సంఘం బి. ప్రణాళికా సంఘం కార్యదర్శి జాతీయాభివృద్ధి మండలి కార్యదర్శిగా కూడా ఉంటారు సి. ఏడో షెడ్యూల్లోని ఉమ్మడి జాబితా ఆర్థిక, సామాజిక ప్రణాళికను రాజ్యాంగం చేర్చింది 1) ఎ, బి 2) బి, సి 3) బి మాత్రమే 4) సి మాత్రమే
కేంద్రం విధించి, వసూలు చేసి రాష్ర్టాలకు ఇస్తున్న పన్ను కింది వాటిలో ఏది? 1) ఎగుమతి, దిగుమతి సుంకాలు 2) స్టాంపు డ్యూటీ 3) ఆదాయపు పన్ను 4) రైలు చార్జీలపై విధించే పన్ను
శాంతిభద్రతలు ఏ జాబితాకు చెందినవి? 1) రాష్ట్రజాబితా 2) కేంద్రజాబితా 3) ఉమ్మడి జాబితా 4) ఏదీకాదు
అవశిష్ట అధికారం కలిగినది? 1) కేంద్రం 2) రాష్ట్రం 3) రాష్ట్రపతి 4) ప్రధానమంత్రి
భారత సమాఖ్యకు, అమెరికా సమాఖ్యకు గల సాధారణ లక్షణం ఏది? 1) ఏక పౌరసత్వం 2) రాజ్యాంగంలో మూడు జాబితాలు 3) ద్వంద్వ న్యాయవ్యవస్థ 4) రాజ్యాంగాన్ని వివరించేందుకు ఒక సమాఖ్య న్యాయవ్యవస్థ
భారత రాజ్యాంగం సమాఖ్యమని తెలిపేది? 1) లిఖిత, ధృఢ రాజ్యాంగం 2) స్వతంత్ర న్యాయవ్యవస్థ 3) అవశేషాధికారాలను కేంద్రమే కలిగి ఉండటం 4) కేంద్ర, రాష్ర్టాల మధ్య అధికార విభజన
దేశంలోని రాష్ర్టాల మధ్య సహకారం సమన్వయాలకు ఉన్న రాజ్యాంగేతర చట్ట పరంకాని సాధనాలు ఏవి? ఎ. జాతీయాభివృద్ధి మండలి బి. గవర్నర్ల సమావేశం సి. మండల కౌన్సిళ్లు డి. అంతర్రాష్ట్ర మండలి 1) ఎ, బి 2) ఎ, బి, సి 3)బి, సి 4) సి
ఆదాయపు పన్ను విధింపు, వసూలు, పంపిణీకి సంబంధించి కింది వాటిలో సరైనది? 1) కేంద్రం విధించి, వసూలు చేసి, ఆ మొత్తాన్ని కేంద్రం, రాష్ర్టాల మధ్య పంపిణీ చేస్తుంది 2) అన్ని పన్నులను కేంద్రం విధించి, వసూలు చేసిన మొత్తాన్ని తానే పొందుతుంది 3) అన్ని పన్నులు కేంద్రం విధించి, వసూలు చేసిన మొత్తాలను రాష్ర్టాలకు పంపిణీ చేస్తుంది 4) ఆదాయపు పన్నుపై వసూలు చేసిన సర్ చార్జీని మాత్రం కేంద్రం రాష్ర్టాల మధ్య పంపిణీ చేస్తుంది.
భారత సివిల్ సర్వీస్ ముఖ్య అధికారిగా ఎవరిని భావించవచ్చు? 1) హోంశాఖ కార్యదర్శి 2) కేబినెట్ కార్యదర్శి 3) సిబ్బంది శాఖ కార్యదర్శి 4) ప్రధానమంత్రి కార్యదర్శి