
ఐబీపీఎస్ నుంచి మరో నోటిఫికేషన్ విడదలైంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పీవో (్రప్రొబేషనరి ఆఫీసర్స్) కొలువుల భర్తీ కోసం నోటిఫికేషన్ అక్టోబర్ 19న విడదలైంది. డిగ్రీ అర్హతతో వాణిజ్య బ్యాంకులో కెరీర్ ప్రారంభించాలనుకునేవారికి ఈ నోటిఫికేషన్ నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇప్పటికే ఐబీపీఎస్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. దేశంలో ప్రస్తుతం 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ 4135 ఖాళీలను భర్తీ చేయనున్నారు. IBPS-XI ద్వారా మొత్తం మూడు దశల్లో పరీక్ష నిర్వహిస్తారు.
IBPS PO/MT అంటే ప్రొబేషనరి ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్. ఇవి బ్యాంకు స్కేల్-I, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సమానం. ఈ మధ్యకాలంలో మొత్తం మూడు బ్యాంకుల నోటిఫికేషన్లు వెలువడినాయి. ఇందులో ఎస్బీఐ పీవో-2021, ఐబీపీఎస్-క్లర్క్-2021, ఇప్పుడు ఐబీపీఎస్ పీవో-2021. మూడు బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసి పూర్తి సమయాన్ని ప్రిపరేషన్, ప్రాక్టీస్ కోసం కేటాయిస్తే జాబ్ మీ సొంతం అవుతుంది.
ఎంపిక విధానం
పీవో ఉద్యోగాలకు ఎంపిక మూడు దశల్లో ఉంటుంది. ఇందులో ఫేజ్-1 ప్రిలిమనరీ, ఫేజ్-2 మెయిన్స్, ఫేజ్-3 ఇంటర్య్యూ/ గ్రూప్ డిస్కషన్స్.
పరీక్ష స్వరూపం
బ్యాంకు పరీక్షలు మల్టిఫుల్ చాయిస్ క్వశ్చన్స్‌తో ఉంటాయి. పీవో మెయిన్స్‌లో వ్యాసం, లెటర్ రైటింగ్ వంటి రాతపరీక్ష ఉంటుంది.
ప్రిలిమనరీకి 60 నిమిషాల కాలవ్యవధి. 3 విభాగాల నుంచి 100 మార్కులకు, 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ప్రతి తప్పు జవాబుకు 1/4 వంతు మార్కుల కోత విధిస్తారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు మెయిన్స్ పరీక్షకు హాజరు కావాలి. కానీ ప్రిలిమ్స్ మార్కులు తుది జాబితా సెలక్షన్స్‌కు పరిగణనలోకి తీసుకోరు.
ప్రస్తుతం మూడు బ్యాంకుల జాబ్ నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటన్నింటికి ఒకే విధమైన సిలబస్, పరీక్ష ప్రక్రియ ఉంటుంది. ఈ అరుదైన అవకాశాన్ని సమగ్ర వ్యూహంతో ప్రణాళికాబద్ధంగా సమయం, శ్రమ కేటాయిస్తే జాబ్ సాధించవచ్చు.
ప్రిలిమ్స్ చాలా కీలకం కాబోతుంది. మొదటి దశలోనే కొన్ని లక్షల మందిని మెయిన్స్ కోసం వడబోస్తారు. కాబట్టి ప్రిలిమ్స్‌ను తేలికగా తీసుకోవద్దు.
ఇంటర్వ్యూ
మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారిని ఇంటర్య్యూకు పిలుస్తారు. బ్యాంకు పీవో జాబ్‌కు మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. వీటిని సంబంధిత బ్యాంకులు నిర్వహిస్తాయి. అభ్యర్థి ఉద్యోగ భవితవ్యం మెయిన్స్, ఇంటర్య్యూలో సాధించిన మార్కులను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఇందులో కనీసం 40% (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ 35%) మార్కులు సాధించాలి.
మెయిన్స్, ఇంటర్వ్యూ స్కోరును 80ః20 శాతంతో 100% వెయిటేజ్‌కు కుదిస్తారు.
ఇందులో మంచి మార్కులు సాధించడానికి ముందుగా బయోడేటా, ఎడ్యుకేషన్ బ్యాగ్రౌండ్ పూర్తి అవగాహనతో ఉండాలి. డిగ్రీలో ఎంచుకున్న సబ్జెక్టులపై ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది.
బ్యాంకు జాబ్ ఎందుకు సెలక్ట్ చేసుకుంటున్నారో స్పష్టమైన వైఖరిని కనబర్చాలి.
బ్యాంకింగ్, ఆర్థిక రంగాల అభివృద్ధికి మార్గదర్శకాలు, నిర్వచనాలు వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి.
రోజువారీ దినపత్రికలు, మాసపత్రికలు వంటి వాటిని చదవాలి. ఇంటర్వ్యూలో కరెంట్ అఫైర్స్‌పై ప్రశ్నలకు ఇది దోహదపడుతుంది.

సబ్జెక్టులవారీగా ప్రిపరేషన్
బ్యాంకు పరీక్షలకు ప్రత్యేకంగా సిలబస్ అంటూ ఉండదు. పూర్వ ప్రశ్నపత్రాల ఆధారంగా సిలబస్‌ను రూపొందించారు. ప్రస్తుతం మూడు బ్యాంకుల జాబ్ నోటిఫికేషన్స్ ఉండటం వల్ల సిలబస్, పరీక్ష విభాగాలు, స్వరూపం వంటి వాటిపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. ఇందులో ఐబీపీఎస్ క్లర్క్లో కాస్త తేలికపాటి ప్రశ్నలు ఉంటే, ఐబీపీఎస్ పీవోలో హెచ్చుస్థాయి ప్రశ్నలు, ఎస్బీఐ పీవోలో కఠినమైన ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి మూడు జాబ్స్‌కు దరఖాస్తు చేసినవారు ముందుగా ఎగ్జామ్ లెవల్పై అంచనా వేయగలగాలి. కామన్ సబ్జెక్టులు, స్కోరింగ్ సబ్జెక్టులు గుర్తించి ప్రిపేర్ కావాలి. అప్పుడే సమయం, శ్రమ ఆదా అవుతుంది. మోడల్ పేపర్స్ సాల్వ్ చేయడానికి పూర్తి సమయాన్ని కేటాయించే అవకాశం ఉంటుంది.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ప్రిలిమనరీ, మెయిన్స్‌లో కామన్ విభాగం. ఇంగ్లిష్ రీడింగ్, అండర్స్టాండింగ్లను పరీక్షిస్తారు. ఇందులో గ్రామర్/నాన్గ్రామర్ పార్టుపై అవగాహన ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా స్కోరింగ్ టాపిక్స్‌పై ఎక్కువ శ్రద్ధపెట్టి చదవాలి. ఇందులో నుంచి క్లోజ్డ్టెస్ట్, పేరాజంబుల్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వొకాబులరీ, ఇడియమ్స్/ఫ్రేజెస్ వంటి ముఖ్యమైన టాపిక్స్ నుంచి 70% ప్రశ్నలు వస్తాయి. 30% రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ కరెక్షన్స్, సెంటెన్స్ కంప్లీషన్స్ వంటి గ్రామర్ పార్ట్ నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయి.
ఇంగ్లిష్‌లో మంచి మార్కులు సాధించాలంటే ముందుగా బ్యాంకింగ్ ఇంగ్లిష్ ప్రీవియస్ పేపర్లను చదవాలి. సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకొని దానిని బాగా రివిజన్ చేయాలి. ఇంగ్లిష్ డైలీ న్యూస్‌పేపర్స్‌లో వచ్చే ఎడిటోరియల్స్, కరెంట్ ఈవెంట్స్‌ను రోజూ చదివి అందులోని అంశాలను, వొకాబులరీని నోట్స్‌లో రాసుకోవాలి. ఫాస్ట్ రీడింగ్ టిప్స్ & అండర్స్టాండింగ్ వంటివి అలవర్చుకోవాలి. లెటర్ రైటింగ్ ఫార్మాట్లు, వ్యాసం టాపిక్స్ ముందుగా నోట్ చేసుకుంటే డిస్క్రిప్టివ్ సులభం అవుతుంది. ఇంగ్లిష్‌పై బాగా పట్టు సాధించడం వల్ల బ్యాంక్ జాబ్ పొందడం ఈజీ అవుతుంది.
క్వాంటిటేవ్ ఆప్టిట్యూడ్
న్యూమరికల్ ఎబిలిటీస్, మ్యాథ్స్ డేటా క్యాలిక్యులేషన్స్, కచ్చితత్వం వంటి శక్తి సామర్థ్యాలను పరీక్షించేందుకు ఈ విభాగం ఉపయోగపడుతుంది. ఇందులో అర్థమెటిక్ అంశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ 50% కామన్ టాపిక్స్ ఉండటం వల్ల లెవల్ ఆఫ్ ఎగ్జామ్‌ని బట్టి ఉమ్మడిగా ప్రిపేర్ అవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
ప్రిలిమ్స్ కోసం నంబర్ సిరీస్, సింప్లికేషన్స్, అప్రాగ్జిమేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి 20 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. డేటా ఇంటర్‌ప్రిటేషన్స్ నుంచి 10 మార్కుల ప్రశ్నలు వస్తాయి. వీటితో పాటు పర్సంటేజేస్, యావరేజస్, టైం అండ్ వర్క్స్, రేషియో-ప్రపోర్షన్స్, ప్రాబబిలిటీ వంటి చాప్టర్స్ కూడా చదవాలి.
మెయిన్స్ కోసం ఎక్కువ శాతం డాటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్స్, టైం, మెన్ అండ్ వర్క్ వంటి అంశాల నుంచి 70% ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మెయిన్స్ కోసం హెచ్చుస్థాయి ప్రశ్నలు బాగా ప్రాక్టీస్ చేయాలి.
రీజనింగ్
ఈ విభాగం నుంచి కామన్‌గా ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో కనిపించే సెక్షన్. ఇందులోనుంచి 6-8 టాపిక్స్ బ్యాంక్ ఎగ్జామ్స్‌లో తరుచూ కనిపించే అంశాలే ఉంటాయి. వాటిని పూర్తి అవగాహనతో మోడల్ వారీగా చదివితే సరిపోతుంది.
ప్రిలిమ్స్‌లో కోడిండ్ డికోడింగ్, సిలాజిసమ్స్, డైరెక్షన్స్ టెస్ట్, ర్యాంకింగ్, కోడెడ్-ఇన్ ఈక్వాలిటీస్, సిరీస్, బ్లడ్‌రిలేషన్స్, పజిల్ టెస్ట్ నుంచి అధిక శాతం ప్రశ్నలు మెయిన్స్‌లో సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్ టెస్ట్, ఇన్పుట్-అవుట్‌పుట్ వంటి హెచ్చుస్థాయి మోడల్ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
రీజనింగ్‌లో అభ్యర్థుల అనలిటిల్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. కాబట్టి స్పీడ్ రీడింగ్, అనాలసిస్ గ్రహించే శక్తి సామర్థ్యాలను అవవర్చుకోవాలి. మంచి మార్కుల కోసం నిత్యం రీజనింగ్ పజిల్స్‌ను సాల్వ్ చేయాలి.
కంప్యూటర్స్
ఇందులో నుంచి ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్, జనరేషన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, లాంగ్వేజెస్, బ్యాంకింగ్ రంగంలో కంప్యూటర్స్ వినియోగం, మొబైల్ యాప్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవల వంటి వాటిపై ప్రశ్నలు ఉంటాయి. ఇవి కేవలం మెయిన్స్‌లో 15 ప్రశ్నలు ఉంటాయి.
జనరల్ అవేర్నెస్
బ్యాంకింగ్/ ఎకానమీ/ జనరల్ అవేర్నెస్ అంశాలు ఈ విభాగంలో ఉంటాయి. ఇందులో జీకే, కరెంట్ అఫైర్స్ లో గత 3-6 నెలల అంశాలు ఉంటాయి. భారత ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, స్టాక్ మార్కెట్ వంటి వాటిపై అధిక ప్రశ్నలు ఉంటాయి.
ఆర్బీఐ త్రైమాసిక రివ్యూ, యాన్యువల్ మానిటరీ రివ్యూ, కీ పాలసీ రేట్లు, బ్యాంకుల వడ్డీ రేట్ల మదింపు, కరోనా కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థ, పథకాల అమల్లో బ్యాంకుల పాత్ర వంటి వాటితో పాటు ఆర్థిక కమిటీలు, రిపోర్టులు, ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీచేసే నియమాలు, ట్యాక్సింగ్, 15వ ఆర్థిక సంఘ సిఫారసులు, జాతీయ-అంతర్జాతీయ అంశాలు, కరోనా-వ్యాక్సిన్లు, భారత శాస్త్రీయ-సాంకేతిక విజ్ఞానాలు, నోబుల్ బహుమతి గ్రహీతలు, అవార్డులు-రివార్డులు, అంతర్జాతీయ సదస్సులు-సమావేశాలు, ముఖ్యమైన రోజులు, వాటి ట్యాగ్లైన్లు, జాతీయ పార్కులు, పుస్తకాలు-రచయితలు వంటి అంశాలు బాగా ప్రిపేర్ కావాలి.
IBPS PO/MT- XI 2021
మొత్తం పోస్టుల సంఖ్య: 4135
విద్యార్హత: డిగ్రీ
వయస్సు: 20-30 ఏండ్లలోపు వారై ఉండాలి
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: నవంబర్ 10
ఫీజు: ఎస్టీ/ఎస్టీ/ పీడబ్ల్యూలకు రూ.175, ఇతరులకు రూ.850
ప్రిలిమినరీ పరీక్ష: డిసెంబర్ 4, డిసెంబర్ 12
మెయిన్స్: జనవరి 2022
ఇంటర్వ్యూ: ఫిబ్రవరి/మార్చి 2022
అపాయింట్మెంట్: ఏప్రిల్ 2022
వెబ్సైట్: www.ibps.in
S Madhukiran
Focus Academy Hyderabad
9030496929