వైఎస్ వివేకా హత్య కేసుపై విజయమ్మ ఏమన్నారంటే!
వైఎస్ వివేకా హత్య కేసు| వైఎస్ వివేకానంద హంతకులను ఖచ్చితంగా ఖచ్చితంగా గుర్తించి శిక్షించాలని వైఎస్ విజయమ్మ డిమాండ్..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై రాష్ట్రంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. దీనిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ స్పందించారు. వైఎస్ వివేకానంద హంతకులను ఖచ్చితంగా ఖచ్చితంగా గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. తనతో ఈ మాటలు తన కొడుకు సీఎం వైఎస్ జగన్, కూతురు వైఎస్ షర్మిల అన్నారని గుర్తు చేశారు.
ఈ విషయంలో రెండో మాటే లేదని స్పష్టం చేస్తూ సోమవారం ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు విషయమై కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తు చేస్తున్నదని వైఎస్ విజయమ్మ గుర్తు చేశారు. సీబీఐ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పని చేస్తున్నప్పుడు, ఈ కేసు దర్యాప్తు విషయమై ఏపీ ప్రభుత్వం చేయగలిగేది ఏమిటని ప్రశ్నించారు. తిరుపతి బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు.
వివేకాను హత్య చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షించాలనే వివేకా కుమార్తె సునీత డిమాండ్ చేస్తున్నారని విజయమ్మ గుర్తు చేశారు. ఇదే తమ కుటుంబంలో ప్రతి ఒక్కరి అభిప్రాయమని స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ మద్దతు సునీతకు ఉందని పేర్కొన్నారు.
ఇటీవల ఢిల్లీలో వైఎస్ వివేకానంద రెడ్డి తనయ సునీత మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రిది రాజకీయ హత్యేనని పేర్కొన్న సంగతి తెలిసిందే. తన తండ్రి హత్యకు గురై రెండేండ్లవుతున్నా న్యాయం జరుగలేదని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవికూడా చదవండి..
హోమ్‌లోన్‌పై వడ్డీ రేటు పెంచిన ఎస్బీఐ
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమికి కరోనా
కర్ణాటక ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో ఊరట
మహారాష్ట్ర హోంమంత్రిపై సీబీఐ ప్రాథమిక విచారణ: హైకోర్టు
కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్.. వీడియో
తప్పు నాదే.. డీకాక్ది కాదు: ఫకర్ జమాన్
హాస్పిటల్లో చేరిన అక్షయ్ కుమార్
కొవిడ్‌తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్‌ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో
స్థిరంగా పసిడి ధర.. స్వల్పంగా తగ్గిన వెండి
మహారాష్ట్ర కొత్త హోంమంత్రిగా పవార్‌కు సన్నిహితుడు
కరోనా రెండో వేవ్ ఎఫెక్ట్: షిర్డీ సాయిబాబా ఆలయం మూత!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

