YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
YS Sharmila | ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ను పోలీసులు హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఉన్న ఆమె నివాసం వద్ద ఉదయం నుంచే భారీగా పోలీసులను మోహరించారు.
YS Sharmila : ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ను పోలీసులు హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఉన్న ఆమె నివాసం వద్ద ఉదయం నుంచే భారీగా పోలీసులను మోహరించారు. ఇండియా కూటమి పార్టీలు విజయవాడలో తలపెట్టిన ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ఈ చర్యకు పూనుకున్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో జాబితా నుంచి పెద్ద ఎత్తున పేర్లు తొలగించారంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఈ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ ఉదయం 10 గంటలకు విజయవాడలోని లెనిన్ సెంటర్ నుంచి రాజ్‌భవన్ వరకు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టంచేశారు.
ఈ క్రమంలోనే షర్మిలతోపాటు పలువురు కాంగ్రెస్, వామపక్ష పార్టీల కీలక నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజ్‌భవన్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసుల ఆంక్షల నడుమ షర్మిల ఇంటి నుంచి బయటకు వస్తారా..? లేదా..? అనే దానిపై ఉత్కంఠ నెలకొన్నది. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనని సర్వత్ర ఆసక్తి నెలకొని ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

