YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు మిస్టర్ 420 అని విమర్శించారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు.
YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు మిస్టర్ 420 అని విమర్శించారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు సాక్షిగా ఈ విషయం నిర్ధారణ అయ్యిందని.. చంద్రబాబు పెద్ద మోసకారని మరోసారి తేలిపోయిందని అన్నారు. చేసిన మోసానికి ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని జగన్ విమర్శించారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరిట మీరు హామీలు ఇచ్చి మోసం చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చాక గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలైన పథకాలు రద్దుచేయడం మరొక మోసం అని అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెనలకు దాదాపు రూ.9వేల కోట్లు బకాయి పెట్టి చేస్తున్నది ఇంకో దారుణమైన మోసం అని తెలిపారు. 143 హామీలతో మీరు ఇచ్చిన మేనిఫెస్టో అతిపెద్ద మోసం అని పేర్కొన్నారు. చివరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టూ మీరు మభ్యపెట్టింది కూడా ఒక ఘరానా మోసమే అని చెప్పారు. ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండని చంద్రబాబును డిమాండ్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

