Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
Kamal Hassan | భారతదేశానికి ప్రధాని (India PM) అంబానీ (Ambani) నా అంటూ టెస్లా (Tesla), స్పేస్ఎక్స్ (SpaceX) సంస్థల అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) చేసిన వ్యంగ్య వ్యాఖ్యలకు ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ (Kamal Hassan) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశ విధానాలను ఏ బిలియనీర్ (Billionaire) నిర్దేశించలేరని వ్యాఖ్యానించారు.
Kamal Hassan : భారతదేశానికి ప్రధాని (India PM) అంబానీ (Ambani) నా అంటూ టెస్లా (Tesla), స్పేస్ఎక్స్ (SpaceX) సంస్థల అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) చేసిన వ్యంగ్య వ్యాఖ్యలకు ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ (Kamal Hassan) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశ విధానాలను ఏ బిలియనీర్ (Billionaire) నిర్దేశించలేరని వ్యాఖ్యానించారు. కమల్ హాసన్ కౌంటర్‌కు నటి, ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) కూడా మద్దతు తెలిపారు.
భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు లైసెన్సింగ్ ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో స్పందించారు. భారత ప్రధాని అంబానీనా..? అంటూ సెటైరిక్‌గా ట్వీట్ చేశారు. దీనిపై కమల్ హాసన్ దీటుగా బదులిచ్చారు. ఏ బిలియనీర్ అయినా, అది భారతీయుడైనా అమెరికన్ అయినా.. దేశ విధానాలను నిర్దేశించలేరని వ్యాఖ్యానించారు. ప్రతి దేశం తన సొంత ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు.
స్వేచ్ఛా వాణిజ్యం గురించి చెప్పే పశ్చిమ దేశాలు రక్షణాత్మక విధానాలు పాటిస్తున్నాయని కమల్ హాసన్ విమర్శించారు. చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై అమెరికా 100 శాతం సుంకాలు విధించి తన దేశీయ పరిశ్రమను కాపాడుకుంటోందని అన్నారు. భారత్ కూడా అదేవిధంగా తన దేశీయ తయారీ రంగాన్ని పరిరక్షించుకోవడానికి చర్యలు తీసుకుంటోందని చెప్పారు. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశమని, వలసపాలిత ప్రాంతం (కాలనీ) కాదని వ్యాఖ్యానించారు.
తాము ప్రపంచాన్ని స్వాగతిస్తామని, కానీ భారత ప్రజలుగా మా భవిష్యత్తును మేమే నిర్ణయించుకుంటామని కమల్ హాసన్ తన పోస్టులో స్పష్టంచేశారు. కమల్ పోస్టును షేర్ చేస్తూ కంగనా రనౌత్ స్పందించారు. కమల్ కౌంటర్ మస్క్‌కు బాగా తగిలి ఉంటుందని కంగనా తన పోస్టులో పేర్కొన్నారు. ఏ బిలియనీర్ దేశ విధానాలను నిర్దేశించకూడదని కమల్ చాలా స్పష్టంగా, వ్యంగ్యంగా, సూటిగా చెప్పారని ప్రశంసించారు. ఇప్పటికే మస్క్ ఆరోపణలను భారత కమ్యూనికేషన్ల శాఖ నిరాధారమైనవని కొట్టిపారేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

