Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
Gautam Gambhir: బౌలర్ల కెరీర్ ప్రమాదంలో పడినట్లు భారత కోచ్ గౌతం గంభీర్ అన్నారు. రాంచీలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విండీస్ 250 రన్స్ చేసిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. ఫ్లాట్ పిచ్‌లపై బౌలర్ల పరిస్థితి దారుణంగా మారుతున్నట్లు చెప్పారు.
రాంచీ: బౌలర్ల కెరీర్ ప్రమాదంలో పడినట్లు భారత కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) అన్నారు. రాంచీలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విండీస్ 250 రన్స్ చేసిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. ఫ్లాట్ పిచ్‌లపై బౌలర్ల పరిస్థితి దారుణంగా మారుతున్నట్లు చెప్పారు. ఏమాత్రం సహకరించని పిచ్‌లపై బౌలర్ల కెరీర్ ప్రమాదంలో పడినట్లే అవుతుందన్నారు. రాంచీ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 501 రన్స్ చేశాయి. 38.3 ఓవర్లలో 33 సిక్సులు బాదారు. ఇటీవల గౌహతిలో జరిగిన రెండో వన్డేలోనూ ఇండియా 406 రన్స్ ఛేజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే బౌలర్లు ఎవరైనా వాళ్లు మనవాళ్లే అని, వారి కెరీర్లో ప్రమాదంలో పడ్డాయని, డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకునేందుకు వాళ్లు చాలా కష్టపడ్డారని, కానీ జీవం లేని పిచ్‌లో బౌలర్ల పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. ఓ దశలో 5 రన్స్‌కే 2 వికెట్లు కోల్పోయిన విండీస్.. హోప్ సెంచరీతో ఈజీగా 250 రన్స్ ఛేజ్ చేసింది.
ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్‌పై ప్రశంసలు కురిపించాడు. మయాంక్ తన స్పీడ్‌తో బౌలింగ్ చేయడం సంతోషంగా ఉందన్నాడు. ఫాస్ట్ బౌలర్ ఎప్పుడూ ఫాస్ట్‌గానే బౌలింగ్ చేయాలని, 150 వేగంతో బౌలింగ్ వేస్తే ఫలితం మరోలా ఉంటుందని తెలిపారు. వెస్టిండీస్ ప్రమాదకరమైన జట్టు అని, 250ని డిఫెండ్ చేసుకోలేకపోవడం శోచనీయమని, విండీస్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారని గంభీర్ తెలిపారు. విండీస్ బౌలర్ రోస్టన్ చేజ్ కీలక దశలో మంచి బౌలింగ్ చేసినట్లు మెచ్చుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

