e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News యూత్ కాంగ్రెస్ అధ్య‌క్షుడిపై క్రైమ్ బ్రాంచ్ క‌న్ను

యూత్ కాంగ్రెస్ అధ్య‌క్షుడిపై క్రైమ్ బ్రాంచ్ క‌న్ను

యూత్ కాంగ్రెస్ అధ్య‌క్షుడిపై క్రైమ్ బ్రాంచ్ క‌న్ను

న్యూఢిల్లీ : యూత్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు బీవీ శ్రీ‌నివాస్‌పై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు క‌న్నేశారు. కరోనా సంక్షోభంలో ఆప‌న్నుల‌కు వైద్య సహాయం అందిస్తున్న బీవీశ్రీనివాస్‌ను శుక్రవారం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ బృందం సుమారు అరగంట పాటు ప్రశ్నించింది. క‌రోనాకు సంబంధించి ఆప‌న్నుల‌కు సహాయం చేయడానికి అతను ఎక్కడి నుంచి మందులు, వైద్య సామగ్రి తీసుకువస్తున్నాడని ఆరా తీసింది. శ్రీ‌నివాస్‌ను ఆయ‌న కార్యాల‌యంలోనే ప్ర‌శ్నించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ హైకోర్టు సూచనల మేరకు ఈ విచారణ జరుగుతున్న‌ది.

మందులు, ఇత‌ర సామ‌గ్రిని ఎలా స‌మ‌కూరుస్తున్నావ‌ని క్రైమ్ బ్రాంచ్ బృందం త‌న‌ను ప్ర‌శ్నించింద‌ని, వారు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చాను అని బీవీ శ్రీ‌నివాస్ చెప్పారు. న‌న్ను ప్ర‌శ్నించిన‌ట్లుగానే ఆర్ఎస్ఎస్‌, బీజేపీ నేత‌ల కార్యాల‌యాల్లో సోదాలు జ‌రిపి ప్ర‌శ్నించే ద‌మ్ము ఢిల్లీ క్రైమ్ బ్రాంచీకి ఉన్న‌దా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా దాడి చేశారు. “చంపిన వ్యక్తి కంటే రక్షకుడు ఎప్పుడూ పెద్దవాడు” అని రాహుల్‌ ట్విట్ చేశారు.

పార్టీ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా ట్వీట్ చేస్తూ, “సహాయం చేస్తున్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌ను ఆపడం మోదీ ప్రభుత్వం భయంకరమైన విధానానికి నిద‌ర్శ‌నం. మేం భయపడేది లేదు లేదా అలాంటి అసహ్యకరమైన ప్రతీకార చర్యల వల్ల మా సేవ‌లు నిలిచిపోవు. సేవ చేయాలనే సంకల్పం మరింత బ‌ల‌ప‌డుతుంది” అని పేర్కొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

జైలులో ఖైదీల మధ్య కాల్పులు, ఇద్దరు హతం

గూగుల్‌తో జ‌త‌క‌ట్టిన ఎలోన్ మ‌స్క్‌ ‘స్టార్‌లింక్’

ఉద‌యం చురుకైన న‌డ‌క‌తో క‌రోనాకు చెక్‌..!

క‌రోనాతో విల‌విల‌.. టోక్యో ఒలింపిక్స్ ఎలా..?

నేను చ‌నిపోతే ఎవ‌రెవ‌రు వ‌స్తారో చూస్తా..! ఓ మ‌హిళ డెత్ రిహార్స‌ల్‌

టీకా తీసుకోండి.. రూ.7.35 కోట్ల జాక్‌పాట్‌ గెలుచుకోండి

స్వ‌తంత్ర్య దేశంగా ఇజ్రాయెల్.. చరిత్ర‌లో ఈరోజు

1100 ఏండ్ల నాటి ప‌ద్యం.. 18 వేల కోట్లు ముంచింది..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యూత్ కాంగ్రెస్ అధ్య‌క్షుడిపై క్రైమ్ బ్రాంచ్ క‌న్ను

ట్రెండింగ్‌

Advertisement