Yashoda | యశోద హిందీ వెర్షన్‌కు సెన్సార్ సభ్యులు ఇంప్రెస్
నవంబర్ 11న తెలుగు, తమిళం, హిందీతోపాటు వివిధ భాషల్లో విడుదల కానుంది యశోద (Yashoda). కాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం యశోద (Yashoda). నవంబర్ 11న తెలుగు, తమిళం, హిందీతోపాటు వివిధ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన యశోద ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
హరి-హరీష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో వచ్చే క్రేజీ ట్విస్టులు, మలుపులు ప్రేక్షకులను డైలమాలో పడేస్తాయట. తాజా అప్డేట్ ప్రకారం బుధవారం యశోద హిందీ వెర్షన్ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు మెంబర్స్ కు సినిమా మొత్తం చాలా బాగా నచ్చిందని బీటౌన్ సర్కిల్ టాక్. కథ, కథనాన్ని ప్రేక్షకులకు పూర్తి కొత్త పంథాలో చూపించడం జరిగిందని సెన్సార్ మెంబర్స్ అభిప్రాయపడ్డారని ఇన్సైడ్ టాక్.
ఈ చిత్రానికి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను శ్రీదేవి మూవీస్ బ్యానర్లపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రమేశ్, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
సమంత యశోద ట్రైలర్ ..
యశోద హిందీ ట్రైలర్ ..
యశోద యాక్షన్ పార్ట్ మేకింగ్ వీడియో..
Read Also :Driver Jamuna | డ్రైవర్ జమున విడుదల వాయిదా.. ఇంతకీ కారణమేంటో?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

