హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): యాదవ న్యాయవాదుల రాష్ట్ర మహాసభను ఈ నెల 7న బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించనున్నట్టు యాదవ మహాసభ న్యాయవాదుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, బార్ కౌన్సిల్ సభ్యుడు చలకాని వెంకట్‌యాదవ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో మహాసభ కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. మహాసభకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్యయాదవ్, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు టీ నాగరాజు, కిశోర్, హనుమంతు, దాసరి శ్రీనివాస్, దూదిమెట్ల శ్రీనివాస్‌యాదవ్, డీ వెంకటేశ్, ముత్యాలు యాదవ్, మంజులత, ఝాన్సీరాణి, పారిజాత తదితరులు పాల్గొన్నారు.