యాదాద్రి ఆలయం పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారు!
Yadadri temple | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్ పునః ప్రారంభ ముహూర్త పత్రికను

హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్ పునః ప్రారంభ ముహూర్త పత్రికను దేవస్థానం ఈవోకు అందజేశారు. ముహూర్త పత్రికను స్వామి పాదాల చెంత ఉంచాలని సూచించారు. త్రిదండి రామానూజ చినజీయర్ స్వామి స్వదస్తూరితో ముహూర్త పత్రిక రాసి ఇచ్చారు. ఈ సందర్భంగా 10వేల మంది రుత్వికులతో సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. హోమాన్ని చినజీయర్ స్వామి పర్యవేక్షిస్తారని చెప్పారు. మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ ముహూర్త వివరాలను ప్రకటించనున్నారు.
ఇవాళ ఉదయం నుంచి సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం.. ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. గండి చెరువు, పుష్కరణి, కల్యాణకట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రతమంటపం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లు, గర్భాల ద్వారాలు, బంగారు తాపడాలు, ఆళ్వార్ మంటపం పనులను పరిశీలించారు.
అలాగే క్యూకాంప్లెక్స్, ఎస్కలేటర్స్, శివాలయం, విష్ణు పుష్కరిణితో పాటు క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణం, ధ్వజస్తంభం ఏర్పాటు చేసిన వేదికను సైతం పరిశీలించగా.. పనుల పురోగతిని సీఎంకు ఆలయ స్తపతి ఆనంద్‌సాయి వివరించారు. ఈ సందర్భంగా తుది పనులపై సీఎం పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని సీఎం కేసీఆర్ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆదేశించారు. రింగు రోడ్డు కోసం షాపింగ్ స్థలాలు కోల్పోయిన వారికి కల్యాణ కట్ట సమీపంలో వేయి స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఉచితంగా షాపులు నిర్మించి ఇవ్వాలని సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
AP News | పంచాయతీ ఎన్నికల పోలింగ్.. కాంగ్రెస్-టీడీపీ బాహాబాహీ..!
Brain Fog | రాత్రి సరిగ్గా నిద్రించినా ఉదయం తల భారంగా ఉంటుందా.. అందుకు కారణాలు ఇవే..
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

