హైదరాబాద్, ఆట ప్రతినిధి: ‘మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఆఫ్ ఇండియా’ హైదరాబాద్‌లో కీర్తి కిరీటంలో మరో కలికుతురాయి చేరింది! క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించే అభిమానుల కోసం భారీ బ్యాట్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. టీ20 వరల్డ్‌కప్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌కు మద్దతుగా పెర్నోడ్ రికార్డు ఇండియా కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటును తయారు చేసింది. 56.1 అడుగుల పొడవు, 9 టన్నుల బరువుతో పోప్లార్ వుడ్‌తో దీన్ని నిర్మించారు. శనివారం ట్యాక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక బ్యాట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ పాల్గొన్నారు. ఈ బ్యాటును పెర్నోడ్ కంపెనీ ప్రతినిధులు ఉదిత్ దుగార్, గోపాల్ అకోత్కర్ తెలంగాణ ప్రభుత్వానికి అందజేశారు.