AP News | రూ.500 తిరిగి ఇవ్వలేదని.. వ్యక్తిపై మరిగే నూనె పోసిన మహిళ.. నెల్లూరులో దారుణం
AP News | కేవలం రూ.500 అప్పు విషయంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించలేదంటూ తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ మహిళ అతడిపై మరిగే నూనె పోసింది.
AP News | కేవలం రూ.500 అప్పు విషయంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించలేదంటూ తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ మహిళ అతడిపై మరిగే నూనె పోసింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. నెల్లూరు రూరల్ మండలం మాదరాజుగూడూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదరాజుగూడూరుకు చెందిన శీనయ్య గతంలో అదే ప్రాంతానికి చెందిన షేక్ హసీనా వద్ద రూ.500 అప్పుగా తీసుకున్నాడు. అయితే తాను హసీనా ఇంట్లో పనిచేసి ఆ డబ్బులకు బదులుగా కూలి చెల్లించానని శీనయ్య చెబుతున్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నది. ఈ క్రమంలో శీనయ్య టిఫిన్ సెంటర్‌కు వెళ్లగా.. తనకు ఇవ్వాల్సిన రూ.500 ఇంకా ఎందుకు చెల్లించలేదని హసీనా ప్రశ్నించింది. తాను ఇప్పటికే ఇంట్లో పనిచేసి అప్పు తీర్చేశానని శీనయ్య బదులిచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకున్నది.
వాగ్వాదం తీవ్రం కావడంతో హసీనా ఆగ్రహానికి గురైంది. టిఫిన్ సెంటర్లో కాగుతున్న నూనెను తీసుకుని శీనయ్యపై పోసింది. వేడి వేడి నూనె శరీరంపై పడటంతో పొక్కులు రావడంతో పాటు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, శీనయ్య ఒంటిపై 30 శాతం గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శీనయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు షేక్ హసీనాపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | రూ.500 తిరిగి ఇవ్వలేదని.. వ్యక్తిపై మరిగే నూనె పోసిన మహిళ.. నెల్లూరులో దారుణం
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
Samantha | తొలి వ్యాపారంలోనే భారీ నష్టాలు.. అయినా వెనక్కి తగ్గని సమంత, ఇప్పుడు 10 స్టార్టప్స్‌లో పెట్టుబడులు!
DSPs Transfers | డీఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం.. జిల్లాలు, కమిషనరేట్లలో ఖాళీలపై ఉన్నతాధికారుల ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

