న్యూయార్క్ : టిక్‌టాక్‌లో (TikTok) వీడియోలు చేస్తూ పేరుతో పాటు రెండు చేతులా డబ్బు ఆర్జించేందుకు అమెరికన్ మహిళ ఏకంగా 83 లక్షల డాలర్ల వేతన ప్యాకేజ్‌తో కూడిన ఉద్యోగాన్ని వదిలేసింది. టిక్‌టాక్ ఇన్ఫ్లుయన్సర్గా ఆమె ఇప్పుడు లక్షల డాలర్లు ఆర్జిస్తోంది. వాల్‌స్ట్రీట్ మాజీ ప్రొఫెషనల్ 29 ఏండ్ల వివాన్ టు ఇప్పుడు కెరీర్‌ను మార్చేసి టిక్‌టాక్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయన్సర్గా మిలియన్ల కొద్దీ డాలర్లు వెనకేస్తోంది. వివాన్ తొలుత బజ్‌ఫీడ్‌లో తన కొలీగ్స్‌కు ఆర్దిక సలహాలు, సమాచారం చేరవేసేందుకు కంటెంట్ క్రియేషన్ కోసం ప్రారంభించిన సోషల్ మీడియా బ్రాండ్ యువర్ రిచ్ బీఎఫ్ఎఫ్ ఆపై విశేష ఆదరణ పొందింది.
2021 జనవరి 1న ఆమె తొలి టిక్‌టాక్ వీడియో వైరల్ కావడంతో కేవలం వారంలోనే లక్ష ఫాలోయర్లను సొంతం చేసుకుంది. నగదు, ఆర్ధిక విషయాలపై వివాన్ టూ కంటెంట్ ఆకట్టుకోవడంతో టిక్‌టాక్ ఇన్ఫ్లుయన్సర్గా ఆమె కొద్ది సమయంలోనే పేరొందింది. ఆపై టిక్‌టాక్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ ఇతర వేదికలపై వివాన్ తన కంటెంట్‌ను మానెటైజ్ చేసుకోవడం ద్వారా భారీగా డబ్బు రాబట్టింది. ఆపై బ్రాండ్ పార్ట్నర్షిప్స్, స్పాన్సర్డ్ కంటెంట్, ఇంటర్వ్యూలు, ఈవెంట్ల ద్వారా భారీగా సంపాదిస్తోంది.
ఇక టిక్‌టాక్ వీడియోలతో ఇబ్బడిముబ్బడిగా రాబడి వచ్చిపడుతుండటంతో బజ్‌ఫీడ్‌లో భారీ వేతనంతో కూడిన జాబ్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో వదిలేసింది. జాబ్‌ను వదిలేసిన మూడు నెలల్లోనే ఆమె బ్రాండ్ యువర్ రీచ్ బీఎఫ్ఎఫ్ సరికొత్త శిఖరాలకు చేరింది. అవకాశాలు వెల్లువెత్తడంతో తన టీం సభ్యులను కూడా పెంచిన వివాన్ పలు నూతన ప్రాజెక్టులను దక్కించుకుంది.
Read More :
David Beckham | డేవిడ్ బెక్‌హమ్‌కు అంబానీ కుటుంబం ప్రత్యేక ఆతిథ్యం.. పిక్ వైరల్