త్వరలోనే ఓ సాధ్వీమణి శతజయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఒక సాధారణ మహిళ ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగుపెట్టి.. తన బోధనలతో వేలమంది జీవితాలను ప్రభావితం చేయడం అరుదైన విషయం. శ్రీమాతాజీగా సుప్రసిద్ధురాలైన నిర్మలాదేవి 1923 మార్చి 21న మధ్యప్రదేశ్లో జన్మించారు. విద్యార్థి దశలో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. మనిషికి ఎందుకిన్ని కష్టాలు? పరిపూర్ణ ఆనందానికి మార్గమే లేదా? అనే ఆలోచన నిర్మలాజీని నిత్యం వేధించేది. సహజానంద స్థితే లక్ష్యంగా.. 1970లో ‘సహజ యోగ’ పేరుతో ధ్యాన విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆమె 2011 ఫిబ్రవరి 23న కైవల్యం పొందారు. స్త్రీ ఔన్నత్యం గురించి నిర్మలాజీ ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పారు.