దర్శకుడు శంకర్ సినిమాల్లో సామాజికాంశాల ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. సమాజంలోని బలమైన సమస్యల్ని చర్చిస్తూ వాటికి పరిష్కార మార్గాల్ని చూపించే ప్రయత్నం చేస్తుంటారాయన. ప్రస్తుతం రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా అగ్ర నిర్మాత దిల్రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని ప్రచారం జరుగుతున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో విద్యార్థి నాయకుడిగా, ప్రభుత్వ ఉద్యోగిగా భిన్న పార్శాలు కలిగిన పాత్రల్లో రామ్చరణ్ కనిపిస్తారని తెలిసింది. అన్యాయాలపై ధిక్కార స్వరం వినిపిస్తూ వ్యవస్థలో సంస్కరణలను తీసుకొచ్చే ప్రగతిశీల భావాలతో ఆయన పాత్ర సాగుతుందని చెబుతున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ను ప్రకటించనున్నారు.