బిజినేపల్లి : నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి( Bijinapalli) మండలంలో ఆదివారం సాయంత్రం గాలివాన ( Windstorm ) బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉక్కపోతగా ఉన్న వాతావరణం సాయంత్రానికి గాలివానతో కూడిన వర్షం కురిసింది.
మండల కేంద్రంతో పాటు పాలెం, ఖానాపూర్, గుడ్ల నర్వ, కారుకొండ, లింగసానిపల్లి, మంగనూరు, వెంకటాపూర్, వసంతపూర్, మహాదేవుని పేట, తదితర గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షానికి వరి, మొక్కజొన్నతో పాటు మామిడి పంట నేలరాలింది. ప్రధాన రహదారుల వెంట ఉన్న భారీ చెట్లు సైతం నేలకొరిగాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. గ్రామాల్లో చిన్న షెడ్లు, డబ్బాలు ధ్వంసం అయ్యాయి. పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం నెలకొంది.