COVID-19 Booster Dose | బూస్టర్ డోస్‌పై ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు!
COVID-19 booster Dose | బూస్టర్ డోస్‌పై ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు! | కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కొవిడ్‌కు వ్యతిరేకంగా పలు దేశాల్లో టీకాల పంపిణీ పూర్తి కాగా.. మరికొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది. ప్రస్తుతం బూస్టర్ డోస్ (మూడో డోసు)పై చర్చ సాగుతున్నది. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. బూస్టర్ డోస్‌పై ప్రస్తుతం భారత్‌లో అవసరమైన

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కొవిడ్‌కు వ్యతిరేకంగా పలు దేశాల్లో టీకాల పంపిణీ పూర్తి కాగా.. మరికొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది. ప్రస్తుతం బూస్టర్ డోస్ (మూడో డోసు)పై చర్చ సాగుతున్నది. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. బూస్టర్ డోస్‌పై ప్రస్తుతం భారత్‌లో అవసరమైన డేటా లేదని, అయితే వచ్చే ఏడాది మొదటట్లో సమాచారం అందుబాటులో ఉండే అవకాశం ఉందన్నారు. యూఎస్, యూకే, ఇజ్రాయెల్ సహా అనేక దేశాలు మహమ్మారిపై పోరాడేందుకు ప్రజలకు బూస్టర్ డోసులు వేయాలని యోచిస్తున్నాయి.
మూడో మోతాదుతో అధిక రక్షణ లభిస్తుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. భారత్‌లో డేటా ప్రస్తుతం బూస్టర్ డోస్ అవసరమని చెప్పడానికి ప్రస్తుతం తమ వద్ద తగినంత డేటా ఉందని అనుకోనని, వ్యాక్సిన్లు అందించే రక్షణపై పూర్తి డేటా ఉండాలన్నారు. ఇందుకు పరిశోధన అవసరమని, దీనికి మరికొద్ది నెలలు సమయం పడుతుందన్నారు. బహుశా వచ్చే ఏడాది ప్రారంభం నాటికి బూస్టర్ డోస్ ఏంటి? ఎవరికి అవసరం? అనే డేటా అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ చీఫ్ పేర్కొన్నారు.
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా టీకాలు వేసిన వ్యక్తులు తీవ్రమైన వ్యాధి నుంచి రక్షణ పొందడం చూస్తున్నామని, ఆసుపత్రుల్లో చేరే సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించడం లేదని డాక్టర్ గులేరియా అన్నారు. ఏదేమైనా ‘ఏదో ఒక సమయంలో బూస్టర్ డోస్ అవసరం కావొచ్చు’ అన్నారు. ‘అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల నుంచి మనకు ఇది అవసరమా? కొత్త వ్యాక్సిన్ కావాలా? వ్యాక్సిన్లను బూస్టర్‌గా కలపాలా? అనే సమాచారం వెలుగులోకి వస్తుందన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్‌లో భాగంగా 58కోట్లకుపైడా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

