e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, April 17, 2021
Advertisement
Home News నాగార్జున ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ అప్‌డేట్

నాగార్జున ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ అప్‌డేట్

నాగార్జున ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ అప్‌డేట్

అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌.  మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వ‌స్తోన్న ఆరో చిత్రం. య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా  చేసుకొని రాసిన క‌థ‌తో అహిషోర్ సాల్మ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజ‌య్ వ‌ర్మ అనే ఒక వైవిధ్య‌మైన పాత్ర‌లో నాగార్జున క‌నిపించనున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ, సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌ను ప‌రిచ‌యం చేస్తూ పోస్ట‌ర్ల‌ను మాత్ర‌మే చిత్ర బృందం విడుద‌ల చేసింది.   ఇప్పుడు ఈ సినిమా దేనిగురించ‌నే విష‌యాన్ని వెల్ల‌డించే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా మార్చి 12 సాయంత్రం 4:05 గంట‌ల‌కు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి ఓ పోస్ట‌ర్‌ను కూడా షేర్ చేశారు. నాగార్జున జోడీగా బాలీవుడ్ తార దియా మీర్జా న‌టిస్తోన్న ఈ మూవీలో మ‌రో బాలీవుడ్ న‌టి స‌యామీ ఖేర్ ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కిర‌ణ్ కుమార్ డైలాగ్స్ రాస్తుండ‌గా, షానీల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

Advertisement
నాగార్జున ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ అప్‌డేట్

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement