Numerology | పెళ్లికి ముందు చాలామంది పురుషుల మనసులో ఒక ప్రశ్న తప్పకుండా ఉంటుంది. తనకు కాబోయే భార్య స్వభావం ఎలా ఉంటుంది? పెళ్లి తర్వాత తమ కుటుంబంతో ఎలా ఉంటుంది? తనతో ఎంత ప్రేమగా ఉంటందనే సందేహాలు ఉంటాయి. అయితే, అమ్మాయిలు పుట్టిన తేదీల ఆధారంగా పెళ్లయిన తర్వాత వారు భర్తతో ఎలా ఉంటారు? వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో కొంతవరకు అంచనా చేయవచ్చని సంఖ్యా శాష్త్ర నిపుణులు చెబుతున్నారు.
సంఖ్యాశాస్త్రం ప్రకారం .. కొన్ని జన్మ సంఖ్యలను శుభ్రపదంగా భావిస్తారు. ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు తమ కుటుంబానికి, అలాగే వివాహం తర్వాత భర్తకు అదృష్టాన్ని తీసుకొస్తారు. మరి 1 నుంచి 9 వరకు జన్మ సంఖ్యలు కలిగిన మహిళల స్వభావం ఎలా ఉంటుంది? వారు ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారో తెలుసుకుందాం..
సాధారణంగా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 1 వస్తుంది. ఈ మూలాంకానికి సూర్యుడిని అధిపతిగా భావిస్తారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం.. ఈ సంఖ్యకు చెందిన మహిళలు ఆత్మవిశ్వాసం ఎక్కువగా కలిగి ఉంటారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. కుటుంబాన్ని క్రమశిక్షణతో నడిపించాలని భావిస్తారు. భర్తను గౌరవించం, ప్రేమగా చూసుకోవడం చేస్తారు.
సాధారణంగా 2, 11, 20, 29వ తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 2 వస్తుంది. ఈ మూలాంకంపై చంద్రుని ప్రభావం ఉంటుందని నమ్ముతారు. సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ సంఖ్యకు చెందిన మహిళలు సున్నితమైన మనసు, భావోద్వేగ స్వభావం కలిగి ఉంటారని చెబుతుంటారు. కుటుంబానికి, భర్తకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. భర్త ఏమనుకుంటున్నాడో చెప్పకముందే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న విషయాల్లోనే ఆనందం వెతుక్కుంటారు. మాటల కంటే కూడా తమ చర్యలతోనే ప్రేమను ఎక్కువగా వ్యక్తపరుస్తుంటారు.
సాధారణంగా 3, 12, 21, 30వ తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 3 వస్తుంది. బృహస్పతి ప్రభావం ఉన్న ఈ మహిళలు ఆశావాద దృక్పథం, కుటుంబం పట్ల అంకితభావం, కలిగి ఉంటారని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. భర్తకు ప్రతి విషయంలో అండగా నిలబడటం, మంచి సలహాలు ఇవ్వడం, సంబంధాల్లో సానుకూలత కొనసాగించడం వీరి స్వాభావం. కుటుంబాన్ని క్రమబద్ధంగా నడిపించాలనే ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటుంది. తమపై ప్రశంసలు, గుర్తింపు రావడం ఇష్టపడతారు.
సాధారణంగా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 4గా వస్తుంది. రాహువు ప్రభావం ఉన్న ఈ మహిళలు కష్టపడే స్వభావం, నమ్మకం, నిజాయితీ కలిగి ఉంటారని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరు కుటుంబ బాధ్యతలను ఎంతో శ్రద్ధగా చూసుకుంటారు. సంప్రదాయాలకు విలువలు పాటించడం, కుటుంబానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే భర్తకు అండగా నిలబడతారు.
సాధారణంగా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 5గా వస్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం బుధుడి ప్రభావం ఉన్న ఈ మహిళలు సరదాగా, ఉత్సాహభరితంగా ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త వ్యక్తులతో త్వరగా కలిసిపోవడం వీరి ప్రత్యేకత. భర్తను మంచి స్నేహితుడిలా భావించి, జీవితాన్ని సరదాగా గడపాలని అనుకుంటారు. ప్రేమలో నమ్మకానికి, ఓపెన్ కమ్యూనికేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
సాధారణంగా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 6గా వస్తుంది. ఈ మూలాంకానికి శుక్రుడిని అధిపతిగా భావిస్తారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం.. ఈ తేదీల్లో పుట్టిన మహిళలు ప్రేమాభిమానాలు ఎక్కువగా చూపించే స్వభావం కలిగి ఉంటారని నమ్ముతారు. భర్తను ప్రత్యేకంగా ఫీల్ అయ్యేలా చూడటం, ఇంటిని అందంగా చూసుకోవడం, కుటుంబంలో సంతోషకర వాతావరణం తీసుకురావడానికి ప్రయత్నిస్తారు.
సాధారణంగా 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 7గా వస్తుంది. ఈ తేదీల్లో పుట్టిన మహిళలు ఆధ్యాత్మిక ఆలోచనలు, లోతైన భావోద్వేగ అనుబంధం కలిగి ఉంటారని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తూనే కొంత వ్యక్తిగత సమయాన్ని ఇష్టపడుతుంటారు. భర్తతో ఆత్మీయ సంబంధాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటారు.
సాధారణంగా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 8గా వస్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం.. శని ప్రభావం ఉన్న ఈ మహిళలు బాధ్యతాయుతంగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. కుటుంబం పట్ల నిబద్ధత, భర్త పట్ల అంకితభావం ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా భర్తకు అండగా నిలబడటంలో ముందుంటారు. అయితే అబద్ధాలు, మోసం వంటి విషయాలను అస్సలు ఇష్టపడరు.
సాధారణంగా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 9గా వస్తుంది. న్యూమరాలజీ ప్రకారం కుజుడి ప్రభావం ఉన్న ఈ మహిళలు ధైర్యం, ఉత్సాహం, రక్షణాత్మక స్వభావం కలిగి ఉంటారు. కుటుంబం, భర్త సంతోషానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. భర్తతో భావోద్వేగంగా దగ్గరా ఉండటానికి ఇష్టపడతారు.
మొత్తానికి ప్రతి మూలాంకానికి చెందిన మహిళలు తమ ప్రేమను వ్యక్తపరిచే తీరు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. కుటుంబం పట్ల నిబద్ధత, అనుబంధం, భాగస్వామిపై శ్రద్ద వంటి అంశాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Note: ఇవి సంఖ్యా శాస్త్రం, సంప్రదాయ నమ్మకాల ఆధారంగా చెప్పబడిన అంశాలు మాత్రమే. వ్యక్తుల స్వభావం, దాంపత్య జీవితం అనేది పరస్పర అవగాహన, పరిస్థితులు, వ్యక్తిగత అనుభావాలపై ఆధారపడి ఉంటుంది.