ఆరోగ్యకర జీవితానికి ప్రణాళికలు.. ఇవి పాటిస్తే చాలు హాయిగా ఉండొచ్చు!
రోజురోజుకు వేగంగా మారుతున్న జీవనశైలి కారణంగా మన శరీరం అనేక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నది.

రోజురోజుకు వేగంగా మారుతున్న జీవనశైలి కారణంగా మన శరీరం అనేక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఉద్యోగులు, వ్యాపారాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు బిజీగా ఉంటూ శరీరంపై దృష్టిపెట్టేందుకు సమయం లేకుండా పోతున్నది. ఈ నేపథ్యంలో ఎదురవుతున్న అనారోగ్య శరీరాన్ని మరమ్మతు చేయడానికి వైద్య సలహాలు, పరీక్షలు, చికిత్స, సంరక్షణ అవసరం అవుతున్నది. వీటన్నిటికీ ప్రజలు తమ డిపాజిట్లలో కొంత భాగాన్ని ఖర్చు చేయాల్సి వస్తున్నది.
తన, తనవారి జీవితం విలువైనందున వారి కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడటం లేదు. అయితే ఆరోగ్యకర జీవన విధాన, ఆరోగ్యకర ప్రణాళికతో వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్యకర జీవనశైలి కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుని వాటిని పాటించాల్సిన అవసరం ఉన్నదని వారు సెలవిస్తున్నారు.
సరైన, సమతుల ఆహారం

శరీరాన్ని సురక్షితంగా ఉంచడానికి శరీరానికి సరైన, సమతుల, అవసరమైన ఆహారాన్ని అందివ్వాలి. సరైన, సమతుల ఆహారం ప్రజలను సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచడానికి.. ఎక్కువ ఆయుర్దాయం కలిగించడానికి సహాయపడుతుంది.
జీవనశైలిలో మార్పులు

జీవనశైలి ప్రజల వ్యక్తిత్వానికి ఆధారం. దినచర్యను అనుసరించాల్సిన బాధ్యతలో ఒత్తిడి, దాని హానికర ప్రభావాలు జీవితంలో భాగమైనప్పుడు ఇది గుర్తుకొస్తుంది. వ్యాయామం, యోగా, వినోదం వంటి వాటిని జీవితంలో చేర్చుకోవడం ద్వారా సంతోషం, ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటారు. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం, మధ్యాహ్నం వేళ సమయానికి భోజనం చేయడం.. రాత్రి వేళ సమయానికి నిద్రపోవడం వంటి అలవాట్లు చేసుకోవడం చాలా మంచిది.
బీమా పథకం

మీకు మీ ప్రియమైనవారి ఆరోగ్యం కూడా అవరసమే. అందుకు ఆరోగ్య బీమా మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. ప్రమాదం లేదా ఆకస్మిక అత్యవసర వ్యాధిని నయం చేయడంలో అయ్యే ఖర్చులకు ఆరోగ్య బీమా భరోసా ఇస్తుంది. పాలసీ తీసుకోవడానికి ముందు బీమాకు సంబంధించిన పూర్తి వివరాలను కనుక్కొని నిర్దారణ చేసుకోవాలి. తల్లిదండ్రులు, భార్య లేదా భర్త, పిల్లల ఆరోగ్యానికి సంబంధించి పూర్తి ఫ్యామిలీ పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి.
చిన్న మొత్తాలతో పొదుపు

పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో చిన్నచిన్న మొత్తాలను పొదుపు చేసుకోవడం ద్వారా ఎమర్జెన్సీ సమయాల్లో ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం పడినప్పుడు ఈ చిన్నమొత్తాల్లోని పెద్ద మొత్తం ఆసరగా ఉంటుందని మరువొద్దు.
ఇవి కూడా చదవండి…
కరోనా కాటుకు షూటర్ దాదీ కన్నుమూత
హిమగ్లోబిన్ పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. అందుకు ఏం చేయాలంటే..?
కరోనా ఎక్కడుందన్నాడు.. దానికే బలయ్యాడు.. ఓ ఎమ్మెల్యే కథ
సినిమా మరిచిపోలేని మహా మనీషి.. చరిత్రలో ఈరోజు
సెంకాకు ద్వీపాన్ని సర్వే చేసిన చైనా.. మరోసారి జపాన్‌తో ఉద్రిక్తత
ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి?
ఈ విటమిన్ సీ పండ్లు తినండి.. రోగనిరోధక శక్తి పెంచుకోండి..!
అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్‌ను ప్రయోగించిన చైనా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

