Nayantara | దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు నయనతార. తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్గా, అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్గా ఆమెది ఓ రికార్డు. ఇప్పటికీ తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవల దక్షిణాదిలో హాయ్యెస్ట్ పెయిడ్ కథానాయికగా ఆమె పేరే వినిపించింది. అయితే మొదట్లో తను సినీ రంగంలోకి వస్తానని అనుకోలేదని, అసలు ఈ రోజు ఇంతటి పేరు, ప్రఖ్యాతులకు నేను అర్హురాలిని అవుతానని ఎప్పుడూ ఊహించలేదని చెబుతూ ఇటీవల ఓ సందర్భంలో తన పాత రోజులను, కెరీర్లో మొదటి అవకాశాం ఎలా వచ్చిందో ఓ మ్యాగ్జైన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నయనతార.
మలయాళ దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ ఓ వీక్లీ పత్రికలో నా ఫోటో చూసి పిలిపిస్తే వెళ్లాను. హీరో జయరామ్‌తో తను తెరకెక్కించబోయే సినిమాలో నటిస్తావా అని అడిగాడు.వినగానే నాకు నిజమా.. కలా అనిపించింది. నిజానికి నేను సినిమాల్లోకి వస్తానని.. వెళతానని ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఈ అవకాశం వచ్చిన సంగతి అమ్మానాన్నలకు చెప్పాను. వాళ్లు ఏ మాత్రం అభ్యంతరం చెప్పలేదు. నీ ఇష్టం అని నాకే నిర్ణయాన్ని వదిలేశారు.
సాధారణంగా అమ్మాయిలు నటిస్తామంటే చాలా మంది తల్లిదండ్రులు వద్దని చెబుతారు. సినీ పరిశ్రమ అంటే వెళ్లొద్దని చెబుతారు.అసలు ఇలా ఎందుకో నాకు అర్థం కాదు. నటన కూడా ఒక కెరీరే కదా…ఈ రంగంలో మంచి పేరు సంపాందించుకున్న వాళ్లు ఎంత మంది లేరు. ఈ విషయంలో అబ్బాయిలకు లేని షరతులు అమ్మాయిలకు ఎందుకు? నాకు మాత్రం మా తల్లిదండ్రుల సపోర్ట్ లభించింది. అలా వాళ్ల ప్రోత్సహాంతోనే మనసిక్కరే మలయాళ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చాను. ఆ తరువాత అనతి కాలంలోనే కెరీర్లో పెద్ద హీరోలతో నటించే అవకాశం వచ్చింది” అంటూ చెప్పుకొచ్చారు నయనతార.