డబ్ల్యూహెచ్‌వో రిపోర్ట్‌ను తప్పుపట్టిన ఎన్కే ఆరోరా
న్యూఢిల్లీ: ఇండియాలో కోవిడ్ వల్ల 47 లక్షల మంది మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఓ రిపోర్ట్‌లో తెలిపింది. దీన్ని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా తప్పుపట్టారు. భారత్‌లో సంభవించిన మరణాలపై డబ్ల్యూహెచ్‌వో ఇచ్చిన నివేదికలో ఎటువంటి లాజిక్ కానీ వాస్తవం కానీ లేదన్నారు. ఆ నివేదిక ఆందోళన కలిగించేలా ఉందన్నారు. మరణాల విషయంలో ఉంటే 20 శాతం తేడా ఉంటుందేమో అని ఆయన అన్నారు.దేశంలో మరణ ద్రువీకరణ విధానం పటిష్టంగా ఉందని, వైరస్ సంబంధింత మరణాలన్నీ నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు. డబ్ల్యూహెచ్‌వో రిపోర్ట్ తప్పుడుగా ఉందని అరోరా అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కొంత ఆలస్యంగా కోవిడ్ మరణాలను రిపోర్ట్ చేస్తున్నాయని, భారత్ చాలా పెద్ద దేశమని, ఒకవేళ మరణాల నమోదు తప్పినా.. అది డబ్ల్యూహెచ్‌వో చెప్పినట్లు 10 శాతం తేడా ఉండదని అరోరా అన్నారు. ఇండియా ఇచ్చిన డేటాను డబ్ల్యూహెచ్‌వో పట్టించుకోలేదని, తన సొంత గణాంకాలనే అది నమ్ముకున్నట్లు ఆయన చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

