న్యూఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ సహచరుడు అయిన అర్ష్ డల్లాను కెనడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో జరిగిన కాల్పుల్లో అర్ష్ ప్రమేయం ఉందని నిర్ధారణ కావడంతో ఆయనను కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని వారు అధికారికంగా నిర్ధారించ లేదు. దీంతో అక్కడి పరిస్థితులను భారత నిఘా వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఒంటారియోలోని మిల్టన్ ప్రాం తంలో చోటుచేసుకున్న కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. వారిలో ఒకరిని దవాఖానలో చేర్చగా, మరో వ్యక్తికి ప్రాథమిక చికిత్స చేసి పంపించేశారు. ఖలిస్థానీ ఉగ్రవాద నెట్వర్క్లో అర్ష్ డలా కీలక పాత్ర పోషిస్తున్నాడు.