Hrithik Roshan | హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గోస్లింగ్(Ryan Gosling) మరియు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే ఇప్పుడు జరిగింది. సైన్స్ ఫిక్షన్ నవల ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ (Project Hail Mary) సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో, ఈ ఇద్దరు దిగ్గజ నటులు ముఖాముఖి చర్చించుకోవడం సినిమా వర్గాల్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ర్యాన్ గోస్లింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మూవీ విశేషాల గురించి చర్చించేందుకు హృతిక్ రోషన్‌తో కలిసి ర్యాన్ గోస్లింగ్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చర్చలో సినిమా మేకింగ్, అంతరిక్ష పరిశోధనలు మరియు నటనలోని లోతుపాతుల గురించి ఆసక్తికరమైన విషయాలను వారు పంచుకున్నారు. కాగా ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.