Brain Fog | రాత్రి సరిగ్గా నిద్రించినా ఉదయం తల భారంగా ఉంటుందా.. అందుకు కారణాలు ఇవే..
రాత్రి ఎనిమిది గంటలు నిద్రపోయినా ఉదయం నిద్రలేవగానే తల భారంగా అనిపించడం, ఏకాగ్రత కుదరకపోవడం, తెలిసిన విషయాలు కూడా గుర్తుకు రాకపోవడం వంటి సమస్యలు కొందరిని వేధిస్తుంటాయి. చిన్న పనులు పూర్తి చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టడం, మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తుకు రాకపోవడం, ఏ పని చేయడానికి వెళ్లామో మర్చిపోవడం వంటివి కనిపిస్తాయి.
Brain Fog | రాత్రి ఎనిమిది గంటలు నిద్రపోయినా ఉదయం నిద్రలేవగానే తల భారంగా అనిపించడం, ఏకాగ్రత కుదరకపోవడం, తెలిసిన విషయాలు కూడా గుర్తుకు రాకపోవడం వంటి సమస్యలు కొందరిని వేధిస్తుంటాయి. చిన్న పనులు పూర్తి చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టడం, మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తుకు రాకపోవడం, ఏ పని చేయడానికి వెళ్లామో మర్చిపోవడం వంటివి కనిపిస్తాయి. ఈ లక్షణాల సమూహాన్నే బ్రెయిన్ ఫాగ్ అంటారు. ఇది ప్రత్యేకమైన వ్యాధి కాదు. శరీరంలో లేదా జీవనశైలిలో ఉన్న కొన్ని సమస్యలకు సంకేతం అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలాసార్లు అసలు కారణాన్ని గుర్తించి సరిదిద్దుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కారణాలు ఏమిటి..?
ఎనిమిది గంటలు నిద్రపోవడమే సరిపోదు. నిద్ర ఎంత లోతుగా, అంతరాయం లేకుండా ఉందన్నది కూడా ముఖ్యమే. నిద్రలో మెదడు జ్ఞాపకాలను క్రమబద్ధీకరించి, రోజంతా సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తుంది. నిద్ర మధ్యలో పదేపదే మెలకువ రావడం వల్ల ఈ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. గురక, నిద్రలో శ్వాస ఆగిపోవడం, ఉదయం నోరు పొడిబారడం, తలనొప్పి, పగటిపూట నిద్రమత్తు వంటివి నిద్రలో శ్వాసకు సంబంధించిన సమస్యలకు సంకేతాలు అయ్యే అవకాశం ఉంటుంది. నిద్రపోయే, నిద్రలేచే సమయాల్లో మార్పులు, సాయంత్రం కాఫీ తాగడం, మద్యం సేవించడం, ఒత్తిడి, ఆందోళన, నిరుత్సాహం కూడా మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయి. ఐరన్, విటమిన్ బి12 లోపం, థైరాయిడ్ సమస్యలు, కొన్ని మందుల దుష్ప్రభావాలు కూడా కారణాలు అవుతాయి.
లక్షణాలు ఎలా ఉంటాయి..?
సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, ఎక్కువసేపు తెరలను చూడడం, గర్భధారణ, రుతువిరతి, కోవిడ్ వంటి అనారోగ్యాల నుంచి కోలుకునే దశలోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రలేవడం, కనీసం ఏడు గంటలు నిద్రపోవడం, మధ్యాహ్నం తర్వాత కెఫీన్‌కు దూరంగా ఉండడం, పడుకునే ముందు తెరలను చూడకపోవడం, సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం, నడక లేదా వ్యాయామం చేయడం వంటి మార్పులు రెండు మూడు వారాలు పాటించి చూడవచ్చు. జ్ఞాపకశక్తిపై పూర్తిగా ఆధారపడకుండా ముఖ్యమైన విషయాలను రాసుకోవడం కూడా ఉపయోగపడుతుంది. అయితే సమస్య రెండు మూడు వారాలకు మించి కొనసాగినా, రోజువారీ పనులకు ఆటంకం కలిగించినా వైద్యులను సంప్రదించాలి.
ఇలా జరిగితే జాగ్రత్త..
బ్రెయిన్ ఫాగ్ అకస్మాత్తుగా మొదలై మాట తడబడడం, ముఖం ఒకవైపు వాలిపోవడం, శరీరంలో ఒకవైపు బలహీనత లేదా మొద్దుబారడం, చూపు సమస్యలు, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలతో కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్యం పొందాలి. ఇవి పక్షవాతానికి సంకేతాలు అవుతాయి. జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గడం, తెలిసిన ప్రదేశాల్లో దారి తప్పడం, ఒకే ప్రశ్నను పదేపదే అడగడం వంటి మార్పులనూ నిర్లక్ష్యం చేయకూడదు. బ్రెయిన్ ఫాగ్‌ను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఒకే పరీక్ష లేదు. వైద్యులు నిద్ర, జీవనశైలి, మందుల వినియోగం, ఆరోగ్య చరిత్రను పరిశీలించి అవసరమైతే రక్తహీనత, విటమిన్ లోపాలు, థైరాయిడ్ సమస్యల కోసం పరీక్షలు సూచిస్తారు. నిద్రలో శ్వాస ఆగిపోతున్నట్లు అనుమానం ఉంటే నిద్ర పరీక్ష చేయించుకోవాలని సూచిస్తారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Brain Fog | రాత్రి సరిగ్గా నిద్రించినా ఉదయం తల భారంగా ఉంటుందా.. అందుకు కారణాలు ఇవే..
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

