మౌంట్‌మాంగనీ: మహిళల వన్డే ప్రపంచకప్‌లో వెస్టిండీస్ మూడో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో విండీస్ 4 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. కాంప్‌బెల్ (53 నాటౌట్; 5 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకుంది. బంగ్లా బౌలర్లలో సల్మా, నహిదా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లా 49.3 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది.