ఈ వారం ధార్మిక పనుల్లో నిమగ్నమవుతారు. సహోద్యోగుల సహకారంతో అధికారుల మన్ననలు అందుకుంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. బంధుమిత్రులతో ఆప్యాయంగా ఉంటారు. భూ లావాదేవీల్లో అదృష్టం కలిసివస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. కోర్టు తీర్పులు సానుకూలంగా ఉంటాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. గత పెట్టుబడులకు ప్రతిఫలాలు పొందుతారు.
శుభకార్యాలకు అనుకూల సమయం. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువర్గం ఆదరణ పొందుతారు. వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. పనుల్లో కాలయాపన ఉండవచ్చు. విహారయాత్రలకు వెళ్తారు. ఇంట్లో వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. రుణ బాధలు తీరిపోతాయి. భూ వ్యవహారాల్లో ఏమరుపాటు తగదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో సత్ఫలితాలు సాధిస్తారు. పై చదువులకు అడ్డంకులు తొలగిపోతాయి. కొత్తగా పరిచయమైన వారితో జాగ్రత్తగా ఉండండి. కొత్త దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. స్నేహితులు, ఆత్మీయులను కలుసుకుంటారు. ఉద్యోగంలో బరువు, బాధ్యతలు పెరిగినప్పటికీ, సమర్థంగా నిర్వహిస్తారు. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ పనులలో కొంత ఆలస్యం జరగవచ్చు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. బంధువులతో భేదాభిప్రాయాలు దూరమవుతాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. విందులకు హాజరవుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. తీర్థయాత్రలకు వెళ్తారు. అదృష్టం కలిసివస్తుంది.
ఆత్మీయులు, స్నేహితుల ప్రోద్బలంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. సత్ఫలితాలను పొందుతారు. బంధుమిత్రులను కలుసుకోవడంతో పనులు నెరవేరుతాయి. అయితే ఖర్చులు పెరగవచ్చు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. నలుగురికి సాయపడతారు. అయితే రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందడంతో కొన్ని పనులు వాయిదాపడవచ్చు. అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. కుటుంబంలో అందరి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార లావాదేవీలు నిరాటంకంగా కొనసాగుతాయి. గతంలో నిలిచిపోయిన పనులు ముందుకు కొనసాగుతాయి.
తీర్థయాత్రలకు, విహారయాత్రలకు అనుకూలమైన సమయం. శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో రెట్టింపు శ్రమ, శ్రద్ధ అవసరం. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులను పూర్తిచేయడంపై మనసు నిలుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. సోదర మూలకంగా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు శ్రమించాల్సి రావచ్చు. వ్యాపారులకు మంచి సమయం. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.
ఆస్తి తగాదాలు ముందుకు వస్తాయి. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. స్థిరాస్తి మూలంగా ఆదాయం రావడం మొదలవుతుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణం, మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త దుస్తులను, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఈ వారం సద్వినియోగం చేసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. తోటి ఉద్యోగుల సహకారం, అధికారుల చేయూత సంతృప్తిని ఇస్తుంది. విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు.
ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు. వృథా చర్చలకు దూరంగా ఉండటం మంచిది. రోజువారీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. ఓపికతో పనులను పూర్తిచేయడం మంచిది. రుణభారం పెరగవచ్చు. ఖర్చుల నియంత్రణపై పట్టు సాధించడం అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. సమయస్ఫూర్తితో మెలగడం అవసరం. శారీరకంగా శ్రమ పెరగవచ్చు. వారాంతంలో మంచి అవకాశాలు పలకరిస్తాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. బంధుమిత్రులతో సరదాగా కాలం గడుపుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో అదృష్టం కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి.
రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. రాబడిని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయడం అవసరం. కుటుంబసభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది. వాహన మరమ్మతులు ముందుకువస్తాయి. ఉద్యోగులు సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. పలుకుబడితో కొన్ని పనులు నెరవేరుతాయి. నలుగురికీ సాయపడతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
ఆదాయం క్రమంగా పెరుగుతుంది. ఊహించని అవకాశాలు తలుపు తడతాయి. మనశ్శాంతికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. సంయమనంతో వ్యవహరిస్తారు. న్యాయ సమస్యలు తీరుతాయి. రోజువారీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. అయితే కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలు సాధిస్తారు. దైవ దర్శనానికి ప్రాధాన్యం ఇస్తారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది.
వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. దాయాదులతో విభేదాలు కొనసాగుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. భూ వ్యవహారాల్లో కాలయాపన జరుగుతుంది. వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు పెరుగుతాయి. పనిభారం పెరగడంతో కొంత అలసటకు గురవుతారు. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనవసరమైన చర్చలు, వివాదాలు రాకుండా చూసుకోవడం మంచిది. ఓపికతో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. చాలాకాలంగా వేదిస్తున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
ప్రయాణాలు కలిసివస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఊహించని లాభాలతో ఆర్థిక పరిస్థితి అనుకూలంగా మారుతుంది. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. బంధుమిత్రుల సాయంతో కార్యసాఫల్యం ఉంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. కుటుంబసభ్యుల సహకారంతో పనులు నెరవేరుతాయి. పిల్లల చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. మంచి అవకాశాలు వస్తాయి. పనిలో నైపుణ్యం ప్రదర్శిస్తారు. పాత సమస్యలు తీరడంతో కొంత ఊరట పొందుతారు. రాజకీయ, ప్రభుత్వ పనుల్లో కార్యసాఫల్యత ఉంది. విదేశీ ప్రయాణాలు చేపడతారు.
రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. నిధుల లేమివల్ల ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పురాణ ప్రవచనాలకు, సాహిత్య సభలకు హాజరవుతారు. సమాజంలో మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. అవకాశాలను సద్వినియోగ పరచుకుంటారు. పిల్లల చదువు, వివాహం, శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహం పెరుగుతుంది. ఉద్యోగులు ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి.