రోజువారీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. సంయమనం పాటించడం అవసరం. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాలతో ఖర్చులు పెరగవచ్చు. పాత బాకీలు వసూలు అవుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. కొత్త వ్యాపార ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. హుందాగా ఉంటారు. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబసభ్యులతో కలిసి విందులకు హజరవుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. భూ వ్యవహారాలు కలిసివస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. సహోద్యోగుల సహకారం ఉంటుంది.
వ్యాపారులకు అనుకూల సమయం. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. పై చదువులకు అడ్డంకులు తొలగుతాయి. కొత్త వ్యాపారంపై మనసు నిలుపుతారు. చాలాకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొత్తగా పరిచయం అయినవారితో అప్రమత్తంగా ఉండాలి. దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. భూ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. శుభకార్యాలకు కాలం అనుకూలం. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చులు తగ్గించుకోవాలి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు.
అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఉల్లాసంగా ఉంటారు. అదృష్టం కలిసివస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబపెద్దల సహకారం లభిస్తుంది. విందులకు హాజరవుతారు. ప్రశాంతంగా ఉంటారు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రభుత్వ పనులలో కొంత ఆలస్యం జరగవచ్చు. సహోద్యోగులతో మనస్పర్ధలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి.
అదృష్టం కలిసివస్తుంది. నిలిచిపోయిన పనులు ముందుకు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త మార్గాలు అన్వేషిస్తారు. సహోద్యోగులతో భేదాభిప్రాయాలు ఏర్పడవచ్చు. కుటుంబసభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. సంతోషంగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఉంది. ఉద్యోగులకు అనుకూల సమయం. అధికారుల ఆదరణ, పనితనానికి గుర్తింపు లభిస్తుంది.
ఉల్లాసంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పనులలో ఆటంకాలు రావచ్చు. కొత్త పనులు ప్రారంభించకుండా, చేతిలో ఉన్న పనులపై దృష్టి సారించండి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో భాగస్వాములతో మనస్పర్ధలు రావచ్చు. పదోన్నతి, స్థానచలన సూచన. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. రాజకీయ, ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. ఇంటి మరమ్మతుల కారణంగా ఖర్చులు ముందుకువస్తాయి.
వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. ఊహించని ఖర్చుల మూలంగా పనుల్లో జాప్యం జరగవచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం, అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలపై మనసు నిలుపుతారు. భూ వివాదాలు ఏర్పడవచ్చు. కాలయాపన చేయకుండా పనులపై మనసు నిలపడం మంచిది. ముఖ్యమైన పనుల్లో పెద్దల సహకారం లభిస్తుంది. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షల్లో సత్ఫలితాలు సాధిస్తారు.
తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. బంధుమిత్రులతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. రుణబాధలు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఓపికతో పనులు పూర్తిచేయడం మంచిది. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై మనసు నిలపాలి. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. అనవసరమైన చర్చల కారణంగా స్నేహితులతో వైరం ఏర్పడే ప్రమాదం ఉంది. విద్యార్థులు చదువుపై మనసు నిలపాలి. పై చదువులకు ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
సమాజంలో గౌరవం పెరుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సత్ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూ వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రాబడిని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేయడం అవసరం. బంధువర్గం, ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కొత్త పరిచయాలు కలిసివస్తాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. నలుగురికి సాయపడతారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది.
కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో సంతోషంగా ఉంటారు. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. న్యాయ సమస్యలు తీరుతాయి. పనుల్లో కాలయాపన, వృథా ఖర్చులు ఉండవచ్చు. రాజకీయ, ప్రభుత్వ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. దైవ దర్శనానికి ప్రాధాన్యం ఇస్తారు. భూ వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. పనిలో బాధ్యతలు పెరుగుతాయి. సంయమనం అవసరం. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. విద్యార్థులు మంచి ఫలితాల కోసం శ్రమించాల్సి రావచ్చు. ఆరోగ్యం బాగుంటుంది.
ఉత్సాహంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. దాయాదులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. సంయమనంతో వ్యవహరించండి. ప్రయాణాలు వాయిదా పడతాయి. పనిభారం పెరగడంతో కొంత అలసటకు గురవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆలోచించి పనులు చేపడతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారుల ఆదరణ పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షల్లో కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి.
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. భూ వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. అనవసరమైన కాలయాపన, ఖర్చులు ఉండవచ్చు. ప్రారంభించిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. సహోద్యోగులు, అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. సంయమనంతో పనులు చేసుకోవడం అవసరం. దృఢ సంకల్పంతో ముందడుగు వేయాలి. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. కోర్టు కేసులలో అనుకూలం. ప్రభుత్వ పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా అందుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆత్మీయులు అనుభవజ్ఞుల సహకారంతో పనులు పూర్తవుతాయి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. వృథా చర్చలకు దూరంగా ఉండటం మంచిది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. రాజకీయ, ప్రభుత్వ పనులలో ఖర్చులు పెరగవచ్చు. పురాణ ప్రవచనాలకు, సాహిత్య సభలకు హాజరవుతారు.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in