కాన్పూర్: శతకం కోసం ఎదురుచూడటం లేదని.. అది సాధించడం పెద్ద కష్టం కాదని టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా అన్నాడు. కాన్పూర్ వేదికగా గురువారం నుంచి న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం పుజారా మాట్లాడుతూ.. ‘గత కొన్నాళ్లుగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాను. 80, 90 పరుగులు చేసినా వాటిని మూడంకెల స్కోరుగా మలచలేకపోయాను. కానీ, జట్టుకు ఉపయుక్తకరమైన ఇన్నింగ్స్‌లు ఆడాననే సంతృప్తి ఉంది. భయం లేకుండా బరిలోకి దిగి ఆటను ఆస్వాదించాలనుకుంటున్నా. ఇంగ్లండ్‌లో ఇదే చేశా.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ దాన్నే కొనసాగిస్తా. నా టెక్నిక్‌లో ఎలాంటి మార్పులు చేయదలుచుకోలేదు’అని అన్నాడు..