ప్రధానితో భేటీకి వెళ్తాం.. : గుప్కర్ కూటమి
ప్రధానితో భేటీకి వెళ్తాం.. : గుప్కర్ కూటమి | ఈ నెల 24న ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరవుతామని గుప్కర్ కూటమి నేతలు తెలిపారు. భేటీకి ముందు కూటమి నేతలు మంగళవారం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా

శ్రీనగర్ : ఈ నెల 24న ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరవుతామని గుప్కర్ కూటమి నేతలు తెలిపారు. భేటీకి ముందు కూటమి నేతలు మంగళవారం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అఖిలపక్షం సమావేశానికి సంబంధించి వ్యూహం సిద్ధం చేశారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశానికి తనతో పాటు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, మహ్మద్ తారిగామి హాజరవుతారని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. సమావేశం ఎజెండా ఇవ్వలేదని, ఈ సందర్భంగా ప్రధాని, హోంమంత్రి ముందు మా అభిప్రాయాలు వెల్లడిస్తామన్నారు. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ ‘మా నుంచి తొలగించిన’ (ఆర్టికల్ 370) దానిపై మాట్లాడుతామన్నారు.
అలాగే రాజకీయ ఖైదీలను సైతం విడుదల చేయాలన్నారు. ఇదిలా ఉండగా.. ప్రధానితో సమావేశానికి ఆహ్వానించిన 14 మంది నాయకుల్లో ఒమర్ అబ్దుల్లా సైతం ఉన్నారు. ఇదిలా ఉండగా.. జమ్మూ కాశ్మీర్ రాజకీయ కార్యకలాపాలను కేంద్రం నిశితంగా గమనిస్తోంది. మొత్తం పరిస్థితిని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పర్యవేక్షిస్తున్నారు. ప్రతిపాదిత సమావేశానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. పీడీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకునేందుకు మెహబూబా ముఫ్తీకి అధికారం ఇవ్వగా. ఎన్సీ చీఫ్ పార్టీ ఎంపీలు, నాయకులు రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నారు. పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్ని పార్టీ సైతం సమావేశమై అభిప్రాయానికి వచ్చాయి. అఖిలపక్షాల సమావేశానికి నలుగురు మాజీ ముఖ్యమంత్రులు, నలుగురు ఉప ముఖ్యమంత్రులు సహా 14 మంది నాయకులను పిలిచిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
జూలై 11న ఆషాడ బోనాలు ప్రారంభం
జగిత్యాల యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం
నేడు 2.09లక్షల మంది ఖాతాల్లోకి ‘రైతుబంధు’
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేసిన టీటీడీ
కొవాగ్జిన్ మూడో విడత ట్రయల్స్‌పై నేడు నిపుణుల కమిటీ సమీక్ష
పులులకూ కరోనా పరీక్షలు.. ఎక్కడంటే?
క్యాన్సర్‌తో మానసిక క్షోభ : నందమూరి బాలకృష్ణ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

