నోముల భగత్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి : మంత్రి తలసాని
నోముల భగత్‌ను గెలిపించాలి | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్లను అభ్యర్థించారు.

నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థించారు.
భగత్ విజయానికి సమిష్టిగా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మంగళవారం భగత్ నామినేషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
అనంతరం నాగార్జున సాగర్‌లో జరిగిన యాదవ సంఘం ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. యాదవుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారని అన్నారు.
యాదవులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించింది టీఆర్ఎస్ పార్టీయేనని గుర్తుచేశారు. గ్రామగ్రామాన తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు.
భగత్ విజయం అందరి గెలుపుగా భావించి గెలిపించేందుకు కృషిచేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు.
కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కట్టెబోయిన గురువయ్య యాదవ్, నియోజకవర్గ నాయకులు మన్నెం రంజిత్ యాదవ్, పెద్దబోయిన శ్రీనివాస్, కట్టెబోయిన గోవర్ధన్ యాదవ్, యాదవ ప్రజాప్రతినిధులు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
జానారెడ్డి ఇక గతం మాత్రమే : మంత్రి జగదీశ్ రెడ్డి
నాన్న ఆశయ సాధనకు కృషి చేస్తా : నోముల భగత్
సాగర్ ఉపఎన్నిక : ముగిసిన నామినేషన్ల పర్వం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

