నార్లాపూర్ నుంచి ఎంజీకేఎల్ఐకి నీళ్లు.. పాలమూరు లిఫ్ట్ జలాలకు కర్షకుల పూజలు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్-1లోని రెండు బాహుబలి మోటర్లు బుధవారం నుంచి నీటిని ఎత్తిపోయగా శుక్రవారం రాత్రి వరకు టీఎంసీ నీరు నార్లాపూర్ రిజర్వాయర్లోకి చేరినట్టు అధికారులు తెలిపారు.
- అడ్డుకున్న అధికార పార్టీ నాయకులు
కొల్లాపూర్, అక్టోబర్ 17 : బీఆర్ఎస్ నాయకుల ఒత్తిడి.. రైతుల ఆందోళన.. సాగునీటి కోసం అన్నదాతల ఎదురుచూపులు వెరసి పాలమూరు లిఫ్ట్ స్టేజ్-1 పరిధిలోని భారీ పంపుల ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్కు చేరిన జలాలు స్లూయిస్ నుంచి ఎంజీకేఎల్ ఆయకట్టులోని డీ-5 కాల్వకు కృష్ణా జలాలు విడుదలయ్యాయి. దీంతో 5,500 ఎకరాల ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది.
శనివారం స్లూయిస్ వద్దకు చేరుకున్న రైతులు పూజలు నిర్వహించి, డెలివరీ సిస్టర్న్ నుంచి ఉప్పొంగుతున్న జలాలను చూసి కేరింతలు కొడుతూ సంబురాలు చేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన నలుగురు నాయకులు వచ్చి నీళ్లు మేము విడుదల చేశామని.. మీరు ఎందుకు పూజలు చేస్తున్నారని ప్రశ్నించారు. మంత్రి జూపల్లిని తీసుకొని వచ్చి డీ-5 కాల్వకు నీళ్లు విడుదల చేయాలి అనుకుంటే.. మీరు పూజలు చేసుకోవడం సరికాదని, వెంటనే పూజలు నిలిపివేయాలని బెదిరించారు. సాగునీరు వస్తే అడ్డుకోమని ఎవరు చెప్పారని, నీళ్లు లేనప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్లారని రైతులు నిలదీయడంతో సదరు కాంగ్రెస్ నాయకులు చప్పుడు కాకుండా జారుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

